రైళ్లలో, స్టేషన్ల పరిసరాల్లో తరచూ పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని... ద.మ.రైల్వే జీఎం గజానన్ మాల్య తెలిపారు. కరోనా నేపథ్యంలో జోన్ పరిధిలో చేపడుతున్న మౌళిక సదుపాయాలపై... సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్ డివిజన్ల రైల్వే మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. రైల్వే ఆసుపత్రులలో ఉన్న వైద్య సౌకర్యాలపై చర్చించారు.
అర్హులైన సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడానికి జోన్ పరిధిలో వ్యాక్సినేషన్ కేంద్రాల ఏర్పాటు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ మహమ్మారి విసురుతున్న సవాళ్లను అరికట్టడానికి సిబ్బంది ముందస్తు చర్యలలో భాగంగా స్వాభావిక మార్పులను అలవర్చుకోవాలని మాల్య అన్నారు. సరుకు రవాణా అభివృద్దికి నూతన మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: మినీ పోల్స్: ప్రచారంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు