ETV Bharat / state

రైళ్లలో రద్దీ సాధారణంగానే ఉంది: ద.మ. రైల్వే జీఎం - దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం

రైళ్లలో రద్దీ పెరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్న దృశ్యాలు వాస్తవం కాదని.. ప్రయాణికుల రద్దీ సాధారణంగానే ఉందని దక్షిణ మధ్య రైల్యే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు.

sc railway gm
Gajanan Malaya
author img

By

Published : Apr 9, 2021, 6:11 PM IST

రైళ్లలో రద్దీ సాధారణంగానే ఉందని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా స్పష్టం చేశారు. కొవిడ్​ ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన అనంతరం నిలిపేసిన సర్వీసులను క్రమంగా పునరుద్ధరించినట్లు వెల్లడించారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 300 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్‌ పూర్తయిందని.. 750 కి.మీ. మేర విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రమాదాల నివారణకు 321 కి.మీ. పరిధిలోని 34 స్టేషన్లల్లో ట్రైన్‌ కొలిజన్‌ అవైడింగ్‌ సిస్టమ్‌ (టీసీఏఎస్‌) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. చెన్నై-దిల్లీ మార్గంలో 2,828 కి.మీ. మేర రైళ్ల వేగాన్ని గంటకు 130 కిలోమీటర్లకు పెంచామన్నారు.

ద.మ.రైల్వే పరిధిలో పార్శిల్స్‌ ద్వారా అత్యధికంగా రూ.108 కోట్ల ఆదాయం సమకూరినట్లు గజానన్‌ తెలిపారు. దేశ రాజధాని దిల్లీకి 2020-21 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 7.3 కోట్ల లీటర్ల పాలు, 120 కిసాన్‌ రైళ్ల ద్వారా 50 శాతం రాయితీతో 40వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసినట్లు చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 183 రైళ్లు నడవగా.. కొవిడ్‌ నేపథ్యంలో 2020-21లో కొంతకాలం పూర్తిగా స్తంభించిపోయాయని.. అనంతరం కరోనా ప్రభావం తగ్గిన వెంటనే దశల వారీగా 180 రైళ్లను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. 2.40 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశామన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే లక్ష కరోనా పరీక్షలు: డీహెచ్‌‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.