రైళ్లు ప్రయాణంలో మాస్క్ ధరించని వారికి రూ.500 జరిమానా విధించనున్నట్లు... ద.మ.రైల్వే ప్రజా సంబంధాల అధికారి రాకేశ్ స్పష్టం చేశారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉమ్మివేయడం, తదితర చర్యలకు పాల్పడిన వారికి సైతం ఈ జరిమానా వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
భారతీయ రైల్వే నిబంధన 2012 ప్రకారం నిబంధనలు పాటించని వారికి... రైల్వే అధికారులు జరిమానాలు విధిస్తారని పేర్కొన్నారు. ప్రయాణికులు కచ్చితంగా ముఖానికి మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. అందరూ బాధ్యతతో వ్యవహరించి కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఆసరా పింఛన్లకు రూ. 11 వేల 508 కోట్లు మంజూరు