హోలీ పండుగను పురస్కరించుకుని నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ పేర్కొంది.
సికింద్రాబాద్-ధన్ పూర్ మధ్య ఈనెల 27న, ధన్ పూర్-సికింద్రాబాద్ 30న, సికింద్రాబాద్-సమస్తిపూర్ 26న, సమస్తిపూర్-సికింద్రాబాద్ మధ్య ఏప్రిల్ 1వ తేదీన నడుపుతున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు.