హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమలనగర్ కాలనీలోని ఓ ఇంట్లో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 106.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, 225 ఖాళీ గన్నీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిమిత్తం మీర్పేట్ పోలీసులకు అప్పగించారు.
రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారన్న ముందస్తు సమాచారం మేరకు దాడి చేశామని ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.
- ఇవీచూడండి: అన్లాక్ 1.0: ఆతిథ్యం, పర్యటకం షురూ