రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పలువురు పోలీసు ఉన్నతాధికారులు నేడు పదవీ విరమణ పొందనున్నారు. వీరిలో ముగ్గురు ఐజీలు, ఒక డీఐజీ, ఓ ఎస్పీ ఉన్నారు. పదవీ విరమణ పొందుతున్న వారి స్థానంలో డీజీపీ మహేందర్ రెడ్డి ఇతరులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పదవీ విరమణ పొందనున్న రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పోరేటర్ ఎండీ మల్లారెడ్డి స్థానంలో ఐజీ సంజయ్‌కుమార్‌ను నియమించారు.
ఎస్ఐబీ ఐజీ ప్రభాకర్ రావు బాధ్యతలను ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్‌కు అప్పగించారు. వరంగల్ సీపీ రవీందర్ బాధ్యతలను సీఐడీ ఐజీ ప్రమోద్‌కుమార్‌కు, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు బాధ్యతలు సైబరాబాద్ సీపీ సజ్జనార్, నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజ్ బాధ్యతలను ఆదిలాబాద్ ఎస్పీ విష్ణుకు అప్పగిస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.