ETV Bharat / state

SCHOOL FEE : ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు.. ఫీజులు దండుకుంటున్న స్కూళ్లు - తెలంగాణ వార్తలు

ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ నగరంలో కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులపై ఫీ‘జులుం’ ప్రదర్శిస్తున్నాయి. విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడి సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తున్న పాఠశాలలు ఫీజులు పెంచి వసూలుకు దిగుతున్నాయి. రెండు లేదా మూడు విడతల్లో చెల్లించాలంటూ తల్లిదండ్రుల మీద గుదిబండలు పెడుతున్నాయి.

SCHOOL FEE
ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు
author img

By

Published : Jul 30, 2021, 3:10 PM IST

  • ఎల్బీనగర్‌ సమీపంలోని ఓ కార్పొరేట్‌ పాఠశాల. సీబీఎస్‌ఈ బోర్డు ప్రకారం మార్చిలోనే ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించింది. అప్పట్లో ఫీజులు 15శాతం పెంచింది. ట్యూషన్‌ ఫీజును ప్రత్యేకంగా విభజించకుండా మొత్తం మూడు విడతల్లో చెల్లించాలని ఆదేశించింది. తొలి విడత ఫీజులు చెల్లించకపోతే ఆన్‌లైన్‌ తరగతులు నిలిపివేస్తామని స్పష్టంచేసింది.
  • బేగంపేటలోని మరో కార్పొరేట్‌ పాఠశాల. గతేడాదితో పోల్చితే ఫీజులను 18శాతం పెంచింది. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ అదే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తోంది. ఏకంగా ఐదో తరగతికి రూ.62వేలు ఫీజు నిర్దేశించి కట్టాలని చెబుతోంది. విద్యాశాఖకు ఫిర్యాదు చేసినా, పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

2021-22 సంవత్సరానికి కేవలం ట్యూషన్‌ ఫీజును పెంచకుండా నెలవారీగా వసూలుచేయాలని గత నెల చివరివారంలో ప్రభుత్వం జీవో 75 విడుదల చేసింది. ఫీజులను 10-30శాతం మేర తగ్గించాలని విద్యాశాఖ మంత్రి ప్రైవేటు యాజమాన్యాలకు సూచించారు. జీవోను పట్టించుకోకుండా కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు ఫీజులను పెంచేశాయి. సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తున్న పాఠశాలలు మార్చి నుంచి విద్యాసంవత్సరం ప్రారంభించాయి. అప్పటికే గతేడాదితో పోల్చితే ఫీజులను 15శాతం వరకు పెంచి 2021-22 సంవత్సరానికి నిర్దేశించాయి. ఫీజులు తగ్గించకుండా మార్చిలో పెంచిన ఫీజులనే కట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నాయి.

తనిఖీలు ఎక్కడ..?

ఫీజుల నియంత్రణపై విద్యాశాఖ పర్యవేక్షణ లోపించిందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. గతేడాది ఫీజు వసూళ్లపై వచ్చిన ఫిర్యాదుల పరిశీలనకు ప్రత్యేకంగా కమిటీ వేసి కార్పొరేట్‌ స్కూళ్లను విద్యాశాఖాధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో వేర్వేరుగా ఫోన్‌ నంబరు కేటాయించి ఫిర్యాదులు స్వీకరించారు. ఈసారి ఎక్కడా ఆ ఏర్పాట్లు లేవు. విద్యాశాఖాధికారులు కనీసం క్షేత్రస్థాయిలో పాఠశాలలను తనిఖీ చేసి ఫీజు వసూళ్లపై పరిశీలన చేసిన దాఖలాల్లేవు. మార్చిలో నిర్దేశించిన ఫీజులపై తల్లిదండ్రులు ప్రైవేటు యాజమాన్యాలను నిలదీసినా ప్రయోజనం లేకుండాపోతోంది. ప్రభుత్వ ఉత్తర్వులతో సంబంధం లేకుండా పెంచిన ఫీజులనే చెల్లించాలని హుకుం జారీ చేస్తున్నారు. ‘ఫీజులపై ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తున్నాం. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ట్యూషన్‌ ఫీజులే వసూలుచేయాలని ప్రైవేటు యాజమాన్యాలను ఆదేశించాం’ అని హైదరాబాద్‌ డీఈవో రోహిణి వివరించారు.

ట్యూషన్‌ ఫీజు అర్థమేంటో..?

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో 4500 ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటిలో 220 వరకు కార్పొరేట్‌ పాఠశాలలున్నాయి. దాదాపు 1800 పాఠశాలలు సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తున్నట్లు అంచనా. ఆయా పాఠశాలల్లో ఫీజుల స్వరూపం, వసూలుతీరుపై తనిఖీచేయాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ట్యూషన్‌ ఫీజులోనే అన్ని ఫీజులను కలిపి వసూలుచేస్తున్న పరిస్థితి. ప్రభుత్వ జీవోకు ముందు నిర్దేశించిన ఫీజులు తగ్గించారా? లేదా? అన్న విషయాన్ని విద్యాశాఖ పట్టించుకోవడం మానేసింది. కేవలం ఉత్తర్వులిచ్చి చేతులు దులుపుకోవడంతో ఫీజులు చెల్లించలేక ఇబ్బందిపడుతున్న పరిస్థితి. ‘‘ట్యూషన్‌ ఫీజుకు అర్థం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ పేరు చెప్పి పాఠశాలలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి’’ అని హైదరాబాద్‌ పాఠశాలల తల్లిదండ్రుల సంఘం సంయుక్త కార్యదర్శి వెంకట్‌ సాయినాథ్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పేరుకు ప్రైవేటు స్కూల్.. ఫీజు మాత్రం ఏడాదికి రూ.500!

SCHOOL FEE: ఫీజులు పెంచొద్దంటూనే.. స్పష్టతనివ్వని సర్కారు..!

SCHOOL FEE: స్కూల్​ ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.