ETV Bharat / state

రూ.3 లక్షలిస్తే బీటెక్‌ పట్టా!.. అడ్డదారుల్లో ఇంజినీరింగ్ కాలేజీలు - హైదరాబాద్​లో రూ.3 లక్షలిస్తే బీటెక్‌ పట్టా

హైదరాబాద్‌ నగరంలోనే ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థి చదువు పూర్తి చేయలేకపోయాడు. ఇక లాభం లేదని అతడి తండ్రి రంగంలోకి దిగాడు. అక్రమానికి ‘స్వయంప్రతిపత్తి’ మార్గం ఉందని తెలుసుకున్నాడు. హైదరాబాద్‌ శివారులోని ఓ రాజకీయ నేతకు చెందిన అటానమస్‌ కళాశాలను సంప్రదించాడు. రూ.3 లక్షలకు బేరం కుదిరింది. ఆ కళాశాలలో చేరి మధ్యలో ఏదో కారణంతో చదువు మానేసిన విద్యార్థి స్థానంలో పేరును చేర్చారు. తమ కళాశాలలో పాసైనట్లు జేఎన్‌టీయూహెచ్‌కు రికార్డు సమర్పించారు. కొద్ది రోజుల్లోనే వర్సిటీ గుర్తింపు పొందిన బీటెక్‌ పట్టా చేతికి వచ్చింది. ఈ విషయం వర్సిటీ దృష్టికి రావడంతో ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

btech
అడ్డదారులకు తెర... రూ.3 లక్షలిస్తే బీటెక్‌ పట్టా!
author img

By

Published : Mar 10, 2021, 6:43 AM IST

యూజీసీ నుంచి స్వయంప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలు సొంతగా పరీక్షలు నిర్వహించుకోవచ్చు. జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో 35 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అటానమస్‌ గుర్తింపు ఉంది. కేవలం పరీక్షల ఫలితాలు విడుదల చేసినప్పుడు జేఎన్‌టీయూహెచ్‌ నుంచి ఆ కళాశాలలకు ఒక అధికారి వెళ్తారు. చదువుతున్న విద్యార్థుల వివరాలు తొలి సంవత్సరం నుంచి జేఎన్‌టీయూహెచ్‌ వద్ద లేకపోవడంతో కళాశాల యాజమాన్యాలు ఏ పేరు సమర్పిస్తే వారి పేరిట బీటెక్‌ పట్టాలు ఇస్తోంది. అంటే తొలి ఏడాదిలో ఒక విద్యార్థి చేరి...అతను రెండో ఏడాది చదువు ఆపేసి...లేదా ఇతర కళాశాలలకు వెళ్లిపోతే...ఆ స్థానంలో మరో విద్యార్థి పేరు చేర్చి...నాలుగో ఏడాది తర్వాత వర్సిటీకి పంపిస్తే చాలు. ఆ పేరుతో బీటెక్‌ పట్టా చేతికి వస్తుంది. కొన్ని అటానమస్‌ కళాశాలలు ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. తాజా కేసు అంశంపై పరీక్షల విభాగంలోని ఓ అధికారికి మౌఖికంగా ఫిర్యాదు అందటంతో ఆయన ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినట్ల తెలిసింది. ఆ విద్యార్థి హాల్‌టికెట్‌ సంఖ్య ఏమిటో తెలుసుకోవాలని, దాంతో అసలు వాస్తవాన్ని బయటకు తీయవచ్చని ఆయన సూచించినట్లు సమాచారం. ‘ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కళాశాలలో చేరని వారి పేరిట బీటెక్‌ పట్టాలు పుట్టించడానికి అవకాశం ఉంది. ఇక నుంచి బీటెక్‌ ప్రవేశాలు పూర్తి కాగానే విద్యార్థుల వివరాలను తెప్పించుకోవాలని నిర్ణయించాం’ అని ఓ అధికారి చెప్పారు.

మరెన్నో అక్రమాలు...

  • స్వయంప్రతిపత్తి ఉన్నందున జేఎన్‌టీయూహెచ్‌ అన్ని విషయాల్లో కలగజేసుకోకూడదని భావిస్తోంది. ఫలితంగా కొన్ని కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అక్రమాలు బయటపడినప్పుడు వర్సిటీ సైతం యూజీసీ దృష్టికి తీసుకువెళ్లడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
  • హైదరాబాద్‌ శివారులోని ఓ కళాశాల కొద్ది రోజుల క్రితం సెమిస్టర్‌ పరీక్షల ప్రశ్నపత్రాలను ముందుగానే విద్యార్థులకు లీకు చేసింది. దీనిపై ఆరోపణలు రావడంతో జేఎన్‌టీయూహెచ్‌ ఇక నుంచి అదే ఆ కళాశాలకు ప్రశ్నపత్రాలను పంపించాలని నిర్ణయించింది.
  • ఓ గ్రూపు విద్యాసంస్థలకు చెందిన ఓ కళాశాల 10-20 శాతం హాజరున్నవిద్యార్థులనూ పరీక్షలకు అనుమతించేందుకు కండోనేషన్‌పేరిట రూ.20వేల చొప్పునవసూలు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.