హైదరాబాద్ దోమలగూడలోని కూచిపూడి గ్రౌండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పేద ప్రజలకు, జీహెచ్ఎంసీ కార్మికులకు సోమ బిస్కెట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయని... ఈ విషయంలో ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాలని అని ఎమ్మెల్యే విన్నవించారు. కార్యక్రమంలో తెరాస యువ నాయకులు ముఠా జైసింహ, సోమ బిస్కెట్ సంస్థ అధినేత సోమ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.