హైదరాబాద్ ఉప్పల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందింది. మేడిపల్లి మండలం పర్వతాపూర్కు చెందిన కొండవేటి సోనాలీ రామంతాపూర్లోని ఓ సంస్థలో పని చేస్తోంది. రాత్రి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరింది. ఉప్పల్ చౌరస్తాలోని విద్యుత్ కార్యాలయం వద్దకు రాగానే వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఆమె అక్కడికి అక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: విడాకుల నోటీసు పంపడంతో వివాహిత ఆత్మహత్య