హైదరాబాద్ నారాయణగూడ ఠాణా పరిధిలో ఓ సాప్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన మనస అదే జిల్లాకు చెందిన అరుణ్ తేజ ఎనిమిదేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వృత్తిరీత్యా ఇద్దరూ బెంగుళూరులో స్థిరపడ్డారు. ఎంతకాలమైన పిల్లలు లేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. భర్త నుంచి వేరుగా ఉంటూ హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ హైదర్‌గూడలోని ఓ అపార్ట్మెంటులో ఉంటోంది. తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరెంటు బిల్లు ఇవ్వడానికి వచ్చిన వాచ్మెన్ ఎంత పిలిచినా తలుపు తీయకపోవడం వల్ల ఇంటి యజమానికి తెలిపాడు. వేరే తాళంతో తలుపు తీసి చూడగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆర్థిక సమస్యలతో బ్యుటీషియన్ ఆత్మహత్య