ETV Bharat / state

ఆశలు ఆవిరి: చిరు వ్యాపారులపై వర్షం దెబ్బ.. లక్షల్లో నష్టం

author img

By

Published : Oct 21, 2020, 5:24 AM IST

చిన్న వ్యాపారులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. లాక్​డౌన్ వల్ల మొన్నటి వరకు దుకాణాలు మూతపడి నష్టపోయిన వ్యాపారులు.. ఇప్పుడు ఎడతెరిపి లేని వర్షాలతో సతమతమవుతున్నారు. పండగ వేళ మంచి గిరాకీ ఉంటుందని ఆశించి.. లక్షలు వెచ్చించి తెచ్చిన సరుకంతా వరద నీటిలో పాడైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే.. భారీ స్థాయిలో నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు.

small-traders-severely-damaged-by-heavy-rains
ఆశలు ఆవిరి: చిరు వ్యాపారులపై వర్షం దెబ్బ.. లక్షల్లో నష్టం

హైదరాబాద్​లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కొదవేలేదు. నగరంలో ప్రతి వీధిలో కిరాణ దుకాణాలు, బట్టల దుకాణాలు, మెడికల్ షాపులు, జనరల్ స్టోర్​లు ఇలా చాలా రకాల చిన్న తరహా వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. పండగ సీజన్​లలో ఈ చిరు వ్యాపారులకు మంచి ఆదాయం వస్తుంది. అయితే కరోనా కారణంగా ఈసారి పరిస్థితులు మారిపోయాయి. లాక్​డౌన్ వల్ల కొన్ని నెలల పాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి. సడలింపుల అనంతరం దుకాణాలు తెరిచినా.. ప్రజలు నిత్యావసరాలకే పరిమితి కావటం వల్ల వ్యాపారం సరిగ్గా జరగలేదు. ఫలితంగా కనీసం దసరా, దీపావళి సమయాల్లోనైనా కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారులు ఆశలు పెట్టుకున్నారు. లక్షలు పెట్టి కావాల్సిన సామాన్లు, సరుకులను కొనుగోలు చేసుకున్నారు. దుకాణాల్లో నిల్వ ఉంచారు.

ఇల్లు గడవటమే..

భారీ వర్షాలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. గత వారం నుంచి కురిసిన వర్షాలతో దుకాణాల్లోకి నీరు చేరింది. దీంతో లక్షలు పెట్టి తెచ్చిన సరుకంతా పాడైపోయింది. అప్పు చేసి మరీ తెచ్చిన సరుకంతా వరద కారణంగా పాడైపోయిందని.. ఇల్లు గడవడం కష్టంగా మారిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వినియోగదారులు వచ్చే పరిస్థితి లేదు..

నగరంలో చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న షాపింగ్ కాంప్లెక్లుల్లోనూ దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఒకటో అంతస్తు నుంచి ఉన్న దుకాణాలు, వ్యాపారాలకు ఎలాంటి నష్టం జరగకపోయినప్పటికీ.. గ్రౌండ్ ఫ్లోర్, సెల్లార్లలో ఉన్న దుకాణాలు పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని దుకాణాల్లో నీళ్లు తగ్గినప్పటికీ వస్తువులన్నీ పాడైపోయాయి. ఇంకా కాలనీల్లో వరద నీరు నిల్వ ఉండటంతో వినియోగదారులు వచ్చి కొనుగోలు చేసే పరిస్థితి లేదు.

ప్రభుత్వమే ఆదుకోవాలి..

ఇంకో రెండు, మూడు రోజులు పరిస్థితులు ఇలాగే ఉంటే.. భారీ స్థాయిలో నష్టపోవాల్సి వస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌ వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.