ETV Bharat / state

తిరుమల ఘాట్​ రోడ్డులో విరిగిపడుతున్న కొండ చరియలు

తిరుమలలోని శేషాచలం కొండలపై పడే వర్షపు నీరు బండరాళ్ల కింద ఉన్న మట్టిని కోసుకుంటూ వెళ్లటంతో రాళ్లు, మట్టి రెండో ఘాట్‌రోడ్డులో పడి రోడ్డు ప్రమాదకరంగా మారుతున్నది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఘాట్‌రోడ్డు పరిశీలన బృందాలచే ప్రత్యేక నిఘాను ఉంచి మట్టిపెళ్లలు, రాళ్లు విరిగిపడుతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు ప్రయత్నించవచ్చు.

Slopes Falls  tirumala ghat road
తిరుమల ఘాట్​ రోడ్డులో విరిగిపడుతున్న కొండ చరియలు
author img

By

Published : Jul 30, 2020, 2:27 PM IST

తిరుమలలోని శేషాచలం కొండలపై పడే వర్షపు నీరు బండరాళ్ల కింద ఉన్న మట్టిని కోసుకుంటూ వెళ్లటంతో రాళ్లు, మట్టి రెండో ఘాట్‌రోడ్డులో పడుతున్నాయి. భాష్యకార్ల సన్నిధి సమీపంలో కొండచరియలు భారీగా విరిగిపడి ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఈనెల 13న పెద్ద బండరాయి ఒకటి ఘాట్‌రోడ్డులో పడింది.

ప్రత్యేక నిఘా అవసరం

వర్షాకాలం ప్రారంభమైతే కొండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి రెండో ఘాట్‌రోడ్డుపై పడుతుంటాయి. గతంలో భారీగా కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను ఐఐటీ ఇంజినీరింగ్‌ నిపుణులతో తితిదే పరిశీలన చేయించి వాటిపై కాంక్రీటు, స్టీలును వాడి నియంత్రించింది. అన్నిచోట్ల ఇదే పరిస్థితి. ఎక్కువగా రాళ్లు పడే ప్రాంతాలలో ప్రత్యేకంగా రివిట్‌మెంట్‌ చేసి రక్షణ గోడను నిర్మించి కొండచరియలు విరిగిపడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఘాట్‌రోడ్డు పరిశీలన బృందాలచే ప్రత్యేక నిఘా ఉంచి ఆయా ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు ప్రయత్నించవచ్చు.

భాష్యకార్ల సన్నిధి నుంచే సమస్య

తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో తిరుమలకు చేరుకునే సమీపంలోని భాష్యకార్ల సన్నిధి నుంచి కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే చెన్నై ఐఐటీ వారి ద్వారా ఆ ప్రాంతంలో రివిట్‌మెంట్‌ చేసి కాంక్రీట్‌, స్టీల్‌తో ప్రత్యేక మెస్‌ ఏర్పాటు చేసి కొండచరియలు విరిగి పడటాన్ని అరికట్టారు. ప్రస్తుతం దానికి సమీప ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ప్రాంతాన్ని ఘాట్‌రోడ్డు ఇంజినీరింగ్‌ బృందం పరిశీలిస్తోంది. గతంలోనూ తిరుమల రెండో ఘాట్‌రోడ్డులోని ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా ఆ ప్రాంతంలో తితిదే రాతిగోడను నిర్మించింది.

దృష్టి సారించాం

కొండచరియలు విరిగి పడగానే తక్షణమే తొలగింపు పనులు చేపడుతున్నాం. మరోవైపు విరిగిపడే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ముందుగానే రివిట్‌మెంట్‌ చేసి గోడలను నిర్మిస్తున్నాం. ఎప్పటికప్పుడు నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం. - బాలకృష్ణ, ఏఈ, తిరుమల ఘాట్‌రోడ్డు

ఇవీ చదవండి...

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.