ETV Bharat / state

రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన నిరుద్యోగం - తెలంగాణ రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన నిరుద్యోగం

తెలంగాణ రాష్ట్రంలో స్వల్పంగా నిరుద్యోగం తగ్గింది. రాష్ట్రాలవారీగా నిరుద్యోగ గణాంకాలను భారత ఆర్థిక పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) ఇటీవల వెల్లడించింది. తెలంగాణలో నిరుద్యోగ రేటు తగ్గినా గతంతో పోల్చినపుడు ఆశాజనకంగా లేదు. గణాంకాలు పరిశీలిస్తే 9.1నిరుద్యోగ శాతం ఎక్కువే.

Slightly reduced unemployment in telangana state
రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన నిరుద్యోగం
author img

By

Published : Aug 14, 2020, 8:41 AM IST

రాష్ట్రంలో నిరుద్యోగ రేటు స్వల్పంగా తగ్గింది. జూన్‌తో పోల్చితే జులైలో 6.4 శాతం తగ్గి నిరుద్యోగ రేటు 9.1శాతంగా నమోదైంది. రాష్ట్రాలవారీగా నిరుద్యోగ గణాంకాలను భారత ఆర్థిక పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) ఇటీవల వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ రేటు 3.56 శాతం తగ్గింది. పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో నిరుద్యోగ రేటు భారీగా తగ్గింది. వ్యవసాయ పనులతో ఉపాధి అవకాశాలు పెరుగుతోండటమే ఇందుకు కారణమవుతోంది. అదే సమయంలో పట్టణాల్లో నిరుద్యోగ రేటులో రికవరీ నెమ్మదిగా ఉంటోంది. కరోనా కేసులు ఎక్కువగా ఉండటం, వ్యాపారాలు ఇప్పుడిప్పుడే మొదలవుతుండటమే ఇందుకు నేపథ్యం. జులైలో పట్టణాల్లో నిరుద్యోగ రేటు 9.15శాతంగా ఉంటే.. గ్రామాల్లో 6.66శాతంగా నమోదైంది.

స్వల్పంగా తగ్గినా...

తెలంగాణలో నిరుద్యోగ రేటు తగ్గినా గతంతో పోల్చినపుడు ఆశాజనకంగా లేదు. గణాంకాలు పరిశీలిస్తే 9.1నిరుద్యోగ శాతం ఎక్కువే. దేశవ్యాప్తంగా ఈ విషయంలో రాష్ట్రం 12వ స్థానంలో ఉంది. లాక్‌డౌన్‌కు ముందు గత మూడేళ్లలో ఇక్కడ ఈ స్థాయిలో నిరుద్యోగ రేటు కనిపించలేదు.

ఇదీ చూడండి- నిఘా నీడలో: స్వాతంత్ర్య వేడుకలకు పటిష్ఠ భద్రత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.