ETV Bharat / state

ఆరేళ్ల పోలీసు రంగంలో.. అనేక మార్పులు - telangana formation day 2020 news

తెలంగాణలో పోలీసు శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఫ్రెండ్లీ పోలీసు విధానం అమలయ్యేలా ఉన్నతాధికారులకు వెసులుబాటు ఇచ్చింది. గత ఆరేళ్లుగా బడ్జెట్ కేటాయింపుల్లోనూ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోంది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టేలా పోలీసు శాఖకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. కానిస్టేబుళ్ల నియామకాలతోపాటు.. హోంగార్డుల వేతనాలు పెంచినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

six years telangana police industry Many changes implemented
ఆరేళ్ల పోలీసు రంగంలో.. అనేక మార్పులు
author img

By

Published : Jun 2, 2020, 4:53 AM IST

ప్రభుత్వం పోలీసు శాఖలో పలు సంస్కరణలు చేపట్టింది. మొదట్లో పోలీస్ స్టేషన్ నిర్వహణ కోసం అతి తక్కువ డబ్బులిచ్చేవారు. కానీ తెరాస ప్రభుత్వం నగరాల్లోని ఒక్కో పోలీస్ స్టేషన్ నిర్వహణ కోసం ఇచ్చే డబ్బులను 10 రెట్లు పెంచింది. పోలీసు శాఖను బలోపేతం చేసేందుకు ఉద్యోగ నియామకాలు చేపట్టింది. 2014 జూన్​లో పోలీసు శాఖలో 8,447 పోలీస్ కానిస్టేబుల్స్​ నియామకాలు జరిగాయి.

ఉద్యోగాలు..

2017లో రాష్ట్రంలో ఏర్పాటైన నూతన జిల్లాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పోలీసు శాఖలో 18,290 పోస్టులను మంజూరు చేసింది. మరోమారు 2018 ఫిబ్రవరి 3న వివిధ హోదాల్లో మరో 14,177 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ హోంశాఖ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. అభ్యర్థుల కనీస వయోపరిమితిని మూడేళ్లు పెంచారు. ఇది వరకు రాష్ట్రంలో రెండు పోలీస్ కమీషనరేట్లు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం కొత్తగా ఏడు పోలీస్ కమీషనరేట్లన్లను నెలకొల్పింది. హోంగార్డుల వేతనాలను సైతం భారీగా పెంచింది. 18,491 హోంగార్డుల వేతనాలు పెంచడంతో అనేక ఇతర సౌకర్యాలూ కల్పించారు. ఆరేళ్ల క్రితం రూ.6వేలుగా ఉన్న హోంగార్డుల వేతనం ప్రస్తుతం రూ. 20 వేలకు చేరుకుంది. ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య అలవెన్స్ కింద అదనంగా 30 శాతం వేతనం అందిస్తున్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అందించే సాయం పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. కానిస్టేబుల్‌ నుంచి అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ హోదా వరకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి ఇస్తున్న పరిహారాన్ని రూ.25 నుంచి రూ.40 లక్షలకు పెంచారు. ఎస్సై హోదా అధికారి చనిపోతే రూ.25 నుంచి రూ.45 లక్షలకు, సీఐ, డీఎస్పీ, అడీషినల్‌ ఎస్పీ హోదా గల అధికారులు మృతి చెందితే ఇస్తున్న మొత్తం రూ. 30 నుంచి రూ.50 లక్షల వరకు, ఎస్పీ స్థాయి లేదా ఐపీఎస్‌ అధికారి మృతి చెందితే రూ.50 లక్షల నుంచి రూ.ఒక కోటికి పెంచారు.

కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం

దేశంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకున్న మొదటి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని హైదరాబాద్​లో నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బంజారాహిల్స్​లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న జంట భవనాల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్, కమాండ్, కంట్రోల్ సెంటర్​ను రూ.350 కోట్ల వ్యయంతో 7 ఎకరాల విస్తీర్ణంలో.. 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. పోలీస్​ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో లక్ష సీసీ పుటేజీలని ఒక్క నిమిషంలోనే పరిశీలించే ఆధునిక పరికరాలు, పరిజ్ఞానం అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్​లో రోజురోజుకూ ఎక్కువవుతున్న ట్రాఫిక్ రద్దీని శాస్త్రీయ పద్ధతిలో క్రమబద్ధీకరించేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్​మెంట్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశంలోనే తొలిసారిగా అనుమానితుల ఫోటోలు క్షణాల్లో సరిపోల్చే ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్​ను ప్రవేశపెట్టింది. నేరస్థులతోపాటు, అనాథ శవాలను, తప్పిపోయినవారిని కూడా దీంతో గుర్తిస్తున్నారు. నేను సైతం కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పోలీసులు... పౌరసమాజం సహకారంతో కాలనీల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లోనూ నేనుసైతం కార్యక్రమాన్ని విస్తరించారు. దేశవ్యాప్తంగా పోలీసులు ఉపయోగిస్తున్న 4,27,529 కెమెరాల్లో 2020 మార్చి నాటికి 66 శాతం.. అంటే 2,75,528 కెమెరాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ నివేదికలో పేర్కొన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మహిళలకు భద్రత

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మహిళలపై వేధింపులకు పాల్పడే వాళ్ల ఆట కట్టించడానికి 2014 అక్టోబర్ 24న షీ బృందాలను తీసుకొచ్చింది. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ప్రవేశపెట్టిన షీ టీం ప్రయోగం సత్ఫలితాలిచ్చాయి. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం షీ టీంలను రంగంలోకి దించింది. రాష్ట్రంలో మొత్తం 200 షీ టీమ్స్ పనిచేస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. వేధింపులకు గురవుతున్న మహిళలు డయల్ 100కు, ఈ మెయిల్, ఫేస్​బుక్, ట్విట్టర్, వాట్సాప్, హాక్ ఐ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. వెంటనే షీ టీమ్స్ స్పందిస్తున్నాయి. ఏదైనా ఆపదొస్తే సమాచారం అందించేలా రాష్ట్రస్థాయిలో షీటీమ్‌ వాట్సప్‌ నంబర్‌ 944166 9988ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వేధింపులకు గురైన మహిళలు, పిల్లల సమస్యల్ని పరిష్కరించి, వారికి భద్రత కల్పించడానికి భరోసా కేంద్రాల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు న్యాయంతోపాటు, ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

డయల్ 100 సేవలు

సైకాలజిస్టులు, లీగల్‌ కౌన్సెలర్లతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నారు. న్యాయం కోసం బాధితులు వివిధ ఏజెన్సీల చుట్టూ తిరగడం భారంగా మారినందున నిపుణులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి సత్వర న్యాయం అందిస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు డయల్ 100 నెంబర్​కు మరింత సాంకేతికత జోడించినట్లు వివరించింది. డయల్ 100కు ఫోన్ చేసిన వాళ్ల ఫోన్ ఒకవేళ స్విచాఫ్ అయితే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లోకేషన్ గుర్తించనున్నారు. సదరు లోకేషన్​ను గస్తీ సిబ్బంది వద్ద ఉండే ట్యాబ్​లకు షేర్ చేయడం వల్ల వాళ్లు సులభంగా అక్కడికి చేరుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలోని 14,500 వాహనాలకు జీపీఎస్ ఉపకరణాలు సమకూర్చారు. గస్తీ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకునే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 8.5 నిమిషాలుగా ఉండే సమయాన్ని... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ సమయం 5 నిమిషాలుగా ఉంది.

వస్తువులు, ఆహార పదార్థాల కల్తీకి పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పీడీ యాక్టులోకి మరో పది అంశాలను చేర్చింది. కల్తీ నిరోధానికి పోలీసు శాఖ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి : శోభాయమానం.. విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న భాగ్యనగరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.