వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులకు అండగా ఉన్న ‘షి’బృందాలు ఆరు వసంతాలు పూర్తి చేసుకున్నాయి. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ ఈ బృందాలను ప్రారంభించింది. తొలుత హైదరాబాద్‌లో ప్రారంభమైన ఇవి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించాయి. ఆరేళ్లలో ఎన్నో కీలకమైన కేసులను పరిష్కరించామని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అధికారిణి స్వాతిలక్రా తెలిపారు.
మహిళలు, ఆడపిల్లలకు అండగా..
ఆరేళ్లలో 30,187 ఫిర్యాదులు రాగా.. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసి 3144 కేసులను నమోదు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ‘షి’ బృందాలు అక్కడున్న ఆడపిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. ‘షి’ బృందాలకు సమాచారమిచ్చిన వెంటనే సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకం మహిళలు, యువతుల్లో ఏర్పడిందని తెలిపారు.
ఇదీ చూడండి: పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో వ్యక్తి హత్య