DE Ramesh investigation in TSPSC case : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న డీఈ రమేశ్‌ను సిట్ అధికారులు రెండో రోజు ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ సహా హైటెక్ మాస్ కాపీయింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఏఓ, ఏఈఈ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్‌కి పాల్పడిన రమేశ్ దాదాపు 7 మంది అభ్యర్థులకు జవాబులను అందించాడు. అందుకోసం ముందే పరీక్షా కేంద్రం నిర్వాహకుడిని బుట్టలోకి దింపాడు.
టోలిచౌకీలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న అలీతో పరిచయం పెంచుకొని ప్రశ్నాపత్రం తెప్పించుకున్నాడు. ఆ తర్వాత వాటికి సమాధానాలను అభ్యర్థులకు చెప్పాడు. అందుకోసం బ్లూటూత్ పరికరాలను అభ్యర్థులకు ముందే సమకూర్చాడు. ఒక్కో అభ్యర్థితో రూ.30లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి సురేశ్‌తో ఉన్న పరిచయం ఆధారంగా ఏఈ ప్రశ్నాపత్రాన్ని తీసుకున్నాడు.
- TSPSC Paper Leak Updates : వీళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్.. మాస్ కాపీయింగ్ కోసం ఏకంగా..!
- TSPSC PAPER LEAKAGE CASE UPDATE : ఎగ్జామ్‌లో టాపర్.. ప్రశ్న అడిగితే నో మేటర్
వాటిని దాదాపు 80మందికి విక్రయించినట్లు సిట్ అనుమానిస్తోంది.అందుకు సంబంధించిన వివరాలను సిట్ అధికారులు రమేశ్ వద్ద ప్రస్తావించి సమాచారం సేకరిస్తున్నారు. మరో 4 రోజులపాటు డీఈ రమేష్ కస్టడీ ఉండటంతో అతన్ని ప్రశ్నించి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.
Accused used chat GPT to cheat in AEE Exam : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులు చాట్ జీపీటీ సహాయంతో ఏఈఈ పరీక్ష రాసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. విద్యుత్‌శాఖ డీఈ రమేశ్ కనుసన్నల్లో పెద్దఎత్తున ప్రశ్నపత్రాలు చేతులు మారినట్లు అధికారులు నిర్దారించారు. ఏఈఈ, డీఏఓ పరీక్షలకు హాజరయ్యే కొందరు అభ్యరులతో ముందుగా ఒప్పందం కుదుర్చుకొని.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పరీక్ష హాలులోని ఏడుగురు అభ్యరులకు సమాధానాలు చెప్పినట్లు సిట్ దర్యాప్తులో తేటతెల్లమైంది.
దీనికి ఓ ఎగ్జామినర్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు కేవలం ప్రశ్నపత్రాలు విక్రయించి మాత్రమే సొమ్ము చేసుకున్న ఈ కేసులో తొలిసారిగా నిందితులు.. ఎలక్ట్రానిక్ డివైజ్ పరికరాలను ఉపయోగించటం కేసు మరింత మలుపు తిరిగింది. విద్యుత్ శాఖ డీఈ రమేశ్‌తో ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా పరీక్ష రాసిన ప్రశాంత్, నరేష్, మహేశ్, శ్రీనివాస్‌ను సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ ముఠా నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన మరో 20 మంది అభ్యరులను సైతం సిట్ పోలీసులు గుర్తించారు.
హైటెక్ మాస్‌కాపీయింగ్: డీఈ రమేశ్ ఆ అభ్యర్థులకు ముందుగా మైక్రోఫోన్ వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లు సమకూర్చాడు. అభ్యర్థులు వాటిని బెల్టులో భద్రపర్చుకొని పరీక్ష హాలులోకి వెళ్లారు. అక్కడి ఎగ్జామినర్ సహాయంతో అభ్యర్థులు ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసుకొని రమేశ్‌కు వాట్సప్ చేసేవారు. వాటిని రమేశ్ చాట్‌జీపీటీ ద్వారా అనువైన సమాధానాలు ఛోదించి వాట్సాప్ ఫోన్‌కాల్ ద్వారా అభ్యరులకు తెలియజేసేవాడు.
ఇవీ చదవండి: