దిశ నిందితుల ఎన్కౌంటర్(Disha encounter case) జరిగిన స్థలంలో సేకరించిన ఆధారాల గురించి క్లూస్ టీం అధికారి వెంకన్నను... సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar commission) ప్రశ్నించింది. పోలీసులు జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) నిబంధనల ప్రకారం వ్యవహరించారా లేదా అని వెంకన్నను కమిషన్ ప్రశ్నించింది. ఎన్కౌంటర్ జరిగిన స్థలానికి సంబంధించిన రఫ్ స్కెచ్‌ను వెంకన్న.. కమిషన్‌కు సమర్పించారు. సంఘటనా స్థలంలో రఫ్ స్కెచ్ గీశారా అని కమిషన్ ప్రశ్నించగా.... అక్కడ జనం ఎక్కువగా ఉండటంతో ఫొటోలు తీసుకొని కంప్యూటర్ ద్వారా మ్యాప్ తయారు చేశామని వెంకన్న వివరించారు.
వెంకన్న విచారణ అనంతరం.. కేర్ ఆస్పత్రి వైద్యులను కమిషన్ విచారించనుంది. దిశ నిందితులు(Disha encounter case) ఆరిఫ్, చెన్నకేశవులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పోలీసులకైన గాయాలు, అందించిన చికిత్స గురించి ఆస్పత్రి వైద్యులను కమిషన్ ప్రశ్నించనుంది. కాగా దిశ కేసు సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్‌ను కమిషన్ ఈ నెల 7న విచారించనుంది.
ఇదీ చదవండి: DISHA ENCOUNTER CASE: క్లూస్ టీం అధికారిపై ప్రశ్నల వర్షం.. సజ్జనార్ విచారణ వాయిదా