విదేశీ బొగ్గు దిగుమతికి బదులుగా స్వదేశీ బొగ్గు వినియోగం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి ప్రత్యేక పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. దీనిని ఆ సంస్థ డైరెక్టర్లు బి.భాస్కర్ రావు, ఎస్.చంద్రశేఖర్ ప్రారంభించారు. బొగ్గు అమ్మకం విధానాలను మరింత సరళీకృతం చేస్తూ ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. సింగరేణిలోని అన్ని సీహెచ్‌పీలు, మైన్ లోడింగ్ పాయింట్లలో జీ-8 గ్రేడ్ నుంచి జీ-15 గ్రేడ్ వరకు బొగ్గును అమ్మకానికి అందుబాటులో ఉంచింది. వినియోగదారులు కోరుకున్న బొగ్గును కొనుగోలు చేసుకొనే అవకాశం ఈ పోర్టల్ ద్వారా కల్పించింది.
ఈ పోర్టల్ ద్వారా ప్రస్తుతం లింకేజీ గల వినియోగదారులతో పాటు, సింగరేణితో లింకేజీ లేని వినియోగదారులు, కొత్త వినియోగదారులు ఎవరైనా సరే బొగ్గు పొందవచ్చునని అధికారులు తెలిపారు. సింగరేణి వెబ్‌సైట్‌లోని ఈ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకొని బొగ్గును కొనవచ్చు. పోర్టల్ వివరాల కోసం www.scclmines.com సందర్శించాలని సింగరేణి సంస్థ పేర్కొంది.