ETV Bharat / state

Singareni Elections Postponed : ఈ నెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలు వాయిదా..

Singareni elections Dates
Singareni Elections Postponed
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 12:31 PM IST

Updated : Oct 11, 2023, 3:53 PM IST

12:28 October 11

Singareni Elections Postponed : ఈ నెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలు వాయిదా..

Singareni Elections Postponed : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయిన వేళ.. సింగరేణి ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సింగరేణి సంస్థలో ఎన్నికలు నిర్వహించేందుకు సింగరేణి గుర్తింపు సంఘం(Singareni Identity Society) విడుదల చేసిన షెడ్యూల్​ను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 28 న జరగాల్సిన ఎన్నికలు వాయిదా వేసి.. డిసెంబర్​ 27న నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఎన్నికలకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికలకు సహకరిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి హామీ పత్రాన్ని అందజేయాలని తెలిపింది.

Singareni Elections Schedule Telangana 2023 : సింగరేణిలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 28న పోలింగ్

Singareni Elections New Date : సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలన్న సింగరేణి అభ్యర్థనకు హైకోర్టు(Telangana High Court) సానుకూలంగా స్పందించి వాయిదా వేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు వాయిదా వేసేందుకు అంగీకారం తెలిపింది. దీంతో పాటు కార్మిక శాఖకు తుది ఎన్నికల జాబితా సింగరేణి సంస్థ సమర్పించాలని హైకోర్టు పేర్కొంది. నవంబర్​ 30లోగా ఈ జాబితాను సమర్పించాలని సూచించింది. సింగరేణి ఎన్నికల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 20కి పైగా మైనింగ్‌ సంస్థల బృందాలు రానున్నాయి.

High Court Judgement on Singareni Elections : సింగరేణిలో జరిగే ఎన్నికలకు కార్మిక సంఘాలు ఎక్కువ శాతం వ్యతిరేకించాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని.. అవి నిర్వహించిన అనంతరం వీటిని ఏర్పాటు చేయాలని సంస్థలోని 13 యూనియన్లు లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారి శ్రీనివాసులను కోరాయి. దీంతో పాటు ఎన్నికల్లో గెలిచిన సంఘం కాలపరిమితిని.. గత ఒప్పందాల అమలు తదితర విషయాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.

మరో వైపు.. గత సంవత్సరం నుంచి హైకోర్టులో సింగరేణి ఎన్నికల వివాదం కొనసాగుతూ వస్తోంది. ఈ ఎన్నికలపై గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఇప్పటికే 3 సార్లు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. జూన్‌ 23న ఎన్నికలు నిర్వహించాల్సిందిగా.. సింగిల్ బెంచ్‌ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై సింగరేణి సంస్థ అప్పీల్‌ చేసింది. ఇవాళ విచారణ చేసి.. డిసెంబర్ 27కి వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించింది. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుక ప్రకటించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని వచ్చిన లాభాల్లో 32 శాతం వాటాను ఇవ్వాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో 42,390 మంది ఉద్యోగుల ఖాతాల్లో రూ.711 కోట్లను జమ చేయనుంది.

Central Govt Petition on Singareni Elections : సింగరేణి ఎన్నికలపై మరో ట్విస్ట్​.. హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర కార్మికశాఖ

SCCL Thirty Two Percent Share to Workers : సింగరేణి కార్మికులకు గుడ్​ న్యూస్.. రూ.700 కోట్ల బోనస్

singareni coal production suspended : భారీ వర్షాలు.. ఆగిన పనులు.. సింగరేణికి కోట్లల్లో నష్టం

Last Updated : Oct 11, 2023, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.