ETV Bharat / state

CM Review on singareni: సింగరేణి కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం:సీఎం కేసీఆర్

సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో వాటాను దసరా కన్నా ముందే చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం ద్వారా సింగరేణి రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులకు సాయం చేయగలమో నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరముందని సమీక్ష సమావేశంలో అభిప్రాయపడ్డారు

CM Review on singareni
సింగరేణి సమావేశం
author img

By

Published : Oct 6, 2021, 5:24 AM IST

Updated : Oct 6, 2021, 6:53 AM IST

సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ లాభాల్లో వాటాను దసరా కన్నా ముందే చెల్లించాలని సీఎండీ శ్రీధర్‌ను సీఎం ఆదేశించారు. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరముందని సమీక్ష సమావేశంలో అభిప్రాయపడ్డారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం ద్వారా సింగరేణి రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులకు సాయం చేయగలమో నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

బొగ్గు తవ్వకంతో పాటు ఇసుక,ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరమున్నదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల వాళ్లు రిటైరైన సింగరేణి కార్మికులను వినియోగించుకుని లాభాలు గడిస్తున్నారని.. మనమేందుకు ఆ పని చేయకూడదని అధికారులతో ముఖ్యమంత్రి సమాలోచనలు చేశారు. బొగ్గుతో పాటు రాష్ట్రంలో నిల్వలున్న ఇతర మైనింగ్ రంగాలను నిర్వహిస్తూ కార్మికులకు పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చర్యలు చేపడుతుందని సీఎం స్పష్టం చేశారు. సింగరేణి సంస్థలో పనిచేసి రిటైరయిన కార్మికులు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అందుతున్న పింఛను రెండు వేల లోపే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన విజ్జప్తి పట్ల సీఎం సానుకూలంగా స్పందించారు.

సీఎంతో భేటీకి ముందు సంస్థ పురోగతిపై సింగరేణి భవన్​లో సంస్థ అధికారుల సమావేశం జరిగింది. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం తొలి ఆరు నెలల్లోనే 85 శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించడం పట్ల సీఎండీ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే ఒరవడి కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మిగిలిన ఆరు నెలల కాలంలో క్రమంగా వృద్ధిని సాధిస్తూ కనీసం 92 శాతం పీఎల్‌ఎఫ్​కు చేరుకుని దేశంలో నెంబర్‌ వన్ స్థానానికి ఎదగాలన్నారు. సమావేశంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం, సోలార్‌ విద్యుత్‌ కేంద్రాల పనితీరుపై ఈఅండ్ఎం డైరెక్టర్‌ సత్యనారాయణరావు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు సోలార్‌, థర్మల్‌ విద్యుత్​కు సంబంధించిన ప్రగతిపై ఆయనకు నివేదిక సమర్పించారు.

ఆరు నెలల్లో 3,085 మిలియన్‌ యూనిట్లు

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 3,085 మిలియన్‌ యూనిట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేసి 58 శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించిందని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే 45 శాతం వృద్ధితో 4,473 మిలియన్‌ యూనిట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేసిందని సీఎండీ శ్రీధర్ తెలిపారు. గతేడాది తొలి ఆరు నెలల్లో 59 శాతం సగటు పీఎల్‌ఎఫ్‌ సాధించిన ప్లాంట్‌ ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 85 శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు.

మొదటి స్థానంలో తెలంగాణ జెన్​కో

కేంద్ర విద్యుత్‌ శాఖ విద్యుత్‌ ఉత్పాదన సంస్థలపై ఇటీవల విడుదల చేసిన ఒక ప్రకటనలో దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న విద్యుత్‌ సంస్థల్లో తెలంగాణ జెన్​కో మొదటి స్థానంలో, సింగరేణి రెండో స్థానంలో నిలవడం చాలా సంతోషకరమన్నారు. అనంతరం జరిగిన సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలపై ఆయన సమీక్షించారు. ఇప్పటికే 209 మెగావాట్ల ప్లాంట్లను పూర్తిచేయడం సంతోషకరమని.. మూడో దశ ప్లాంట్లను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. సింగరేణి సంస్థ రానున్న మూడేళ్లలో ప్రతీ ఏడాది 500 మెగావాట్ల చొప్పున సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎండీ శ్రీధర్ ఆదేశించారు.

ఇదీ చూడండి: Singareni coal: పొరుగు రాష్ట్రాల్లో కొరత.. ఉత్పత్తి పెంచాలన్న సీఎండీ

Last Updated : Oct 6, 2021, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.