ETV Bharat / state

కొత్తగా ఐదు గనుల నిర్మాణ ప్రణాళికకు సింగరేణి బోర్డు ఆమోదం

Singareni Board approves four new mining plans
కొత్తగా ఐదు గనుల నిర్మాణ ప్రణాళికకు సింగరేణి బోర్డు ఆమోదం
author img

By

Published : Oct 3, 2020, 5:56 PM IST

Updated : Oct 3, 2020, 6:48 PM IST

17:52 October 03

కొత్తగా ఐదు గనుల నిర్మాణ ప్రణాళికకు సింగరేణి బోర్డు ఆమోదం

కొత్తగూడెంలో కొత్త ఓపెన్ కాస్ట్ గనితో పాటు.. 4 గనుల విస్తరణ నిర్మాణ ప్రణాళికలకు సింగరేణి బోర్డు ఆమోద ముద్ర వేసింది. కొత్తగూడెం ఏరియా పరిధిలో నూతన ఓపెన్ కాస్ట్.. కాసీపేట, ఆర్కే-1ఏ, శ్రీరాంపూర్ 1, శ్రీరాంపూర్ 3, 3ఏ భూగర్భ గనుల విస్తరణ నిర్మాణ ప్రణాళికలకు సీఎండీ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం అనుమతినిచ్చింది. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల యూనిఫాం కోసం తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ నుంచి రూ. 3 కోట్ల 65 లక్షలతో వస్త్రాలు కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించింది.

మూడో దశ సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ కాంట్రాక్టులను సైతం సింగరేణి బోర్డు అనుమతినిచ్చింది. మూడో దశలో జైపూర్​లోని థర్మల్ విద్యుత్ కేంద్రం నీటి రిజర్వాయర్​పై 10 మెగా వాట్లు, మూతపడిన బెల్లంపల్లి డోర్లీ ఓపెన్ కాస్ట్ గని క్వారీ నీటిపై 5 మెగా వాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్లు నిర్మించనున్నారు. దీంతోపాటు ఆర్.జి, డోర్లీ ఓపెన్ కాస్ట్ ఓవర్ బర్డెన్ డంపులపై ప్లాంటు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 80.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనుల కాంట్రాక్టులకు బోర్డు అంగీకరించింది. రానున్న రెండేళ్లకు ఓసీ గనుల్లో వినియోగించే పేలుడు పదార్థాల కొనుగోలుతో పాటు, సింగరేణి నిర్వహిస్తోన్న పేలుడు పదార్థాల ఉత్తత్తి కేంద్రానికి అవసరమైన అమ్మోనియం నైట్రేట్, రూఫ్ బోల్టుల కొనుగోలుకు బోర్డు అనుమతించింది. సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి డైరెక్టర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: జిల్లా ఇంటర్‌ విద్యాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Last Updated : Oct 3, 2020, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.