హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ అనే 12 సంవత్సరాల చిన్నారి ఏడో తరగతిలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడు. మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో డాటా సైంటిస్ట్‌గా ఉద్యోగం సంపాదించిన సిద్ధార్థ పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు సిద్ధార్థను అభినందించారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా సిద్ధార్థను ఆయన నివాసానికి ఆహ్వానించారు. 12 ఏళ్ల వయస్సులోనే ఐటీ రంగంలో అపార ప్రతిభ కనబరుస్తోన్న సిద్ధార్థను అభినందించారు. విద్యార్థి దశలోనే భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దుకుంటోన్న సిద్ధార్థ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని మంత్రి ప్రశంసించారు.
ఇవీ చూడండి: రాజులేలిన రాచకొండలో దాగున్న జలపాతాలు