హైదరాబాద్ జియాగూడ వద్ద మూసీ ఉద్ధృతితో నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని పోలీసులు రక్షించారు. మంగళవారం రాత్రి పురానాపూల్ వంతెన వద్ద నీటిలో గుర్తు తెలియని వ్యక్తి మునిగిపోతున్నాడని సమాచారం అందుకున్న మంగల్ హాట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రాణాలకు తెగించి నీటిలోకి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తిని బయటికి తీశారు. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ రాజుతో పాటు హబీబ్ నగర్ సీఐ సైదులు సదరు వ్యక్తిని రక్షించి... చికిత్స నిమిత్త ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: