ETV Bharat / state

'ఎస్సై జీవన్ గారూ... కరోనా పూర్తిగా తగ్గిందా.. మీ సేవలు అమోఘం'​ - మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

కరోనా నుంచి కోలుకుని విధుల్లోకి చేరిన జగిత్యాల జిల్లా గొల్లపల్లి ఎస్సై జీవన్​తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడారు. "థ్యాంక్యూ వారియర్స్" కార్యక్రమంలో భాగంగా వైరస్ సోకిన తర్వాత తీసుకున్న జాగ్రత్తలు, పరిస్థితుల్లో వచ్చిన మార్పులను అడిగి తెలుసుకున్నారు.

'ఎస్సై జీవన్ గారూ... కరోనా పూర్తిగా తగ్గిందా.. మీ సేవలు అమోఘం'​

author img

By

Published : Aug 14, 2020, 7:53 AM IST

జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో కొవిడ్ వైరస్ నుంచి కోలుకుని విధుల్లో చేరిన ఎస్సై జీవన్​ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరామర్శించారు. "థ్యాంక్యూ వారియర్స్" కార్యక్రమంలో భాగంగా వైరస్ సోకిన అనంతరం తీసుకున్న జాగ్రత్తలు, పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వివరాలపై ఆరా తీశారు.

'యువత మాస్కులు ధరిస్తోందా ?'

మాస్కులు యువత వినియోగిస్తోందా అని మాజీ ఎంపీ కవిత ఆరా తీశారు. ముఖ్యంగా లాక్​డౌన్ సమయంలో పోలీసులు అందించిన సేవల ఫలితంగా ప్రజల్లో పోలీసుల పట్ల ఎనలేని గౌరవం పెరిగిందని కీర్తించారు. పోలీసులు ఎక్కడా మనోధైర్యాన్ని కోల్పోకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు.

'స్వయంగా మాట్లాడటం పట్ల సంతోషకరం'

కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్న కవిత... కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి తమ వంతు పాత్ర పోషించాలన్నారు. మాజీ ఎంపీ కవిత స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం పట్ల ఎస్సై జీవన్ సంతోషం వ్యక్తం చేశారు. తమకు మనోధైర్యాన్ని ఇవ్వడం వల్ల మరింత స్ఫూర్తిగా పనిచేయగలుగుతామని ఎస్సై స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : అమీన్​పూర్​ అనాథాశ్రమ ఘటనలో వెలుగుచూస్తున్న కీలకాంశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.