తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. సబేరాలో అర్చకులు, అధికారులు రాష్ట్రపతిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ రాష్ట్రపతి దంపతులకు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనం ముగించుకుని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం 3గంటల 40 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌లో శ్రీహరికోట వెళ్లనున్నారు.
ఇవీ చదవండి.. ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం