కెనడాలోని కాల్గరీ శ్రీ అనఘా దత్త సొసైటీ (శ్రీ సాయిబాబా మందిరం)లో ప్రవాసాంధ్రులు... శ్రీ మహా విష్ణు సుదర్శన యాగం నిర్వహించారు. లోక కల్యాణార్థం ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 26 వరకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. చాలా మంది భక్తులు కరోనా కారణంగా ఆన్లైన్ ద్వారా ప్రత్యక్ష పూజలను వీక్షించారు. చివరి రోజున శ్రీ మహావిష్ణు, మహాలక్ష్మి కల్యాణంతో క్రతువు ముగిసింది. అతిథులకు మహా నైవేద్యం అందజేశారు.

లలిత, శైలేష్ దంపతులు.. మరెంతో మంది వాలంటీర్ల సహకారంతో ఈ యాగాన్ని వైభవంగా పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అనఘా, సాయిబాబా భక్తులు మార్చి 24 నుంచి విష్ణు సహస్రనామ పారాయణాన్ని కోటి మూడు లక్షలకు పైగా పఠించారు. విష్ణు సహస్రనామ పారాయణతో కనకధార స్తోత్రం (7600 సార్లు), పురుష సూక్తం (2175 పర్యాయములు), సాయి సూక్తం (1060 పర్యాయములు) పఠించారు.