Shopkeepers Protest on Road in Srisailam: ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలోని ఆలయానికి ఇరువైపులా ఉన్న పాత దుకాణాలను తొలగించడానికి దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. దుకాణాలు తొలగించడానికి దేవస్థానం అధికారులు జేసీబీ యంత్రం, లారీ, ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. పాత దుకాణాలను కొత్తగా నిర్మించిన లలితాంబికా సముదాయంలోకి తరలించాలని ఇప్పటికే దేవస్థానం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 15వ తేదీ లోపు దుకాణాలను తరలించాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ వ్యాపారులు స్పందించలేదు.
దుకాణాలు తొలగించడానికి అధికారులు చర్యలు చేపట్టడంతో వ్యాపారులు నిరసనకు దిగారు. వ్యాపారులు మహిళలు ఆలయం ముందు భాగం వద్ద ఉన్న దుకాణాల వద్ద బైఠాయించారు. కొత్తగా నిర్మించిన సముదాయాల్లో తమకు సరైన సదుపాయాలు లేవని మహిళలు ఆరోపించారు. నిరసన విరమించాలని ఎస్సై లక్ష్మణరావు వ్యాపారులకు సూచించారు. పాత దుకాణాలు తరలించడానికి తమకు కొంత గడువు కావాలని మహిళలు కోరారు. వ్యాపారులు ఒకవైపు నిరసన తెలుపుతున్నా మరోవైపు రెండు దుకాణాలను దేవస్థానం అధికారులు ఖాళీ చేయించారు. మిగతా దుకాణాల తొలగింపుపై కూడా చర్యలు కొనసాగుతున్నాయి.
ఇవీ చదవండి: