ETV Bharat / state

గంజ్​ మార్కెట్​లో దుకాణాలు తెరవాలని వినతిపత్రం - Ganj market latest news

మలక్​పేట గంజ్​ మార్కెట్​ వ్యాపారులు నిరసనకు దిగారు. మార్కెట్​లో కంటోన్మెంట్​ గడువు పూర్తైనా.. అమ్మకాలు, కొనుగోళ్లు ప్రారంభం కాలేదని ఆందోళన చేపట్టారు. తాము తీవ్రంగా నష్టపోతున్నామని మార్కెట్​ ఛైర్​పర్సన్​ రాధకు వినతిపత్రం అందజేశారు. అయితే ఇప్పుడు మార్కెట్​.. జీహెచ్​ఎంసీ వాళ్ల పరిధిలోకి వెళ్లిందని ఆమె తెలిపారు.

గంజ్​ మార్కెట్​లో దుకాణాలు తెరవాలని వినతిపత్రం

author img

By

Published : May 18, 2020, 2:23 PM IST

హైదరాబాద్ మలక్‌పేట గంజ్ మార్కెట్‌లో వ్యాపారులు ఆందోళనకు దిగారు. మార్కెట్‌లో వ్యాపారాలకు అనుమతి ఇవ్వాలని ఆయా దుకాణాల యాజమానులు మార్కెట్ ఛైర్‌పర్సన్‌ రాధకు వినతిపత్రం సమర్పించారు.

మార్కెట్‌లో కంటోన్మెంట్‌ గడువు పూర్తి అయినా.. అమ్మకాలు, కొనుగోళ్లు ప్రారంభంకాకపోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు అవేదన వ్యక్తం చేశారు. దుకాణాల్లో ఉన్న సరకులు పాడవుతాయని తెలిపారు. వ్యాపారులు లేవనెత్తిన అంశాలను జీహెచ్‌ఎంపీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని రాధ తెలిపారు.

"దుకాణాలు ప్రారంభించడానికి అనుమతివ్వాలనేదే మా డిమాండ్​. ప్రభుత్వ నిబంధనలు అన్నీ మెము పాటిస్తాం. మాస్క్​లు ధరిస్తాం. శానిటైజర్​లు ఉపయోగిస్తాం. భౌతిక దూరం పాటిస్తాం. కొంత సమయం తీసుకొని కొనుగోళ్లు ప్రారంభిస్తే మా వ్యాపారం చేసుకుంటాం."

-వ్యాపారి

గంజ్​ మార్కెట్​లో దుకాణాలు తెరవాలని వినతిపత్రం

"మేము చాలా పేదవాళ్లం. తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతోంది. అందుకే వ్యాపార కొనుగోళ్లు ప్రారంభించాలని విన్నవించుకుంటున్నాం. భౌతిక దూరం కూడా పాటిస్తాం. అందరూ సహకరించి.. దుకాణాలు ప్రారంభమయ్యేలా చూడండి."

-శ్రీకాంత్, వ్యాపారి​

"ఈ దుకాణాదారుల సరకులు పాడవుతాయని వాళ్లు ఆవేదన చెందుతున్నారు. 14 రోజుల క్వారంటైన్​ ముగిసింది కదా.. షాపులు ప్రారంభించమని వినతి పత్రం అందజేశారు. అయితే ఇప్పుడు ఈ మార్కెట్​ జీహెచ్​ఎసీ వాళ్ల పరిధిలో ఉంది. కరోనా కేసులు పెరుగుతున్నందున వాళ్లే నిర్ణయం తీసుకుంటారు."

-రాధ, మార్కెట్ ఛైర్ పర్సన్

ఇవీ చూడండి: కూలీ బతుకు.. అందని మెతుకు !

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.