Shivaratri celebrations in Hyderabad: మహా శివరాత్రి వేడుకలు భాగ్యనగరంలో ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. పర్వదినం వేళ మహా శివుడిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ఉన్న శివాలయాలకు వచ్చే భక్తులకు నాంపల్లి మజ్లిస్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్.. ఆలయం ముందు పండ్లు పంచారు. కులమతాలకు అతీతంగా ఒక ప్రజాప్రతినిధిగా.. శివరాత్రి రోజు ఉపవాసం ఉండే భక్తుల కోసం ఈ పండ్ల పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బర్కత్‌పురలోని యాదాద్రి భవన్ నుంచి యాదగిరిగుట్టకు బయల్ధేరిన 29వ అఖండ జ్యోతియాత్రను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అఖండ జ్యోతి వెళ్లే మార్గంలోని అన్ని వర్గాలు ప్రజలు జ్యోతిని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. కొత్త దేవాలయాలను నిర్మించడం కంటే ఉన్న దేవాలయాలను పటిష్టంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 156 దేవాలయాలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని ఆయన తెలిపారు.
Kishan Reddy in Mahashivratri celebrations: ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు నిర్మించబోయే రైల్వే పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. భూసేకరణ పనులు ఎంత తొందరగా ప్రారంభిస్తే అంతే తొందరగా పనులు చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైన కేసీఆర్ చొరవ చూపి రైల్వేలైన్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మహాశివరాత్రి కావడంతో రాష్ట్రంలోని శివాలయాలన్ని భక్తులతో నిండిపోయాయి. ముఖ్యంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం, నిర్మల్‌లోని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో గోదావరి నది పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు ఉదయం నుంచే వస్తున్నారు. వాహనాల్లో వచ్చిన భక్తుల రోడ్డుపక్కనే వాటిని నిలిపివేయడంతో రోడ్లలన్ని ట్రాఫిక్‌జామ్ అయ్యాయి.
ఇవీ చదవండి:
వేములవాడలో జంగమయ్య పండుగ.. పోటెత్తిన వీఐపీలు.. దర్శనంలో జాప్యంతో భక్తుల ఆగ్రహం
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
Himanshu Kalvakuntla : సోషల్ మీడియాలో కేటీఆర్ తనయుడు హిమాన్షు సాంగ్ వైరల్