ETV Bharat / state

Shilpa Chowdary Bail: శిల్పా చౌదరికి బెయిల్​ మంజూరు

శిల్పా చౌదరి
శిల్పా చౌదరి
author img

By

Published : Dec 16, 2021, 4:13 PM IST

Updated : Dec 16, 2021, 10:28 PM IST

16:11 December 16

శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు

Shilpa Chowdary Bail: పెట్టుబడుల పేరుతో పలువురిని మోసం చేసిన కేసులో అరెస్టయిన శిల్పాచౌదరికి బెయిల్​ మంజూరు అయింది. ఉప్పర్​పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పలువురిని మోసం చేసిన కేసులో శిల్పాచౌదరి అరెస్టయిన సంగతి తెలిసిందే. రూ.7 కోట్ల మేర మోసం చేసిందని శిల్పపై ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేశారు. దివ్యారెడ్డి ఫిర్యాదు చేసిన కేసులోనే శిల్పకు బెయిల్ మంజూరైంది. మరో రెండో కేసుల్లో శిల్పా చౌదరికి బెయిల్‌ లభించలేదు. అయితే.. శిల్పాచౌదరిపై నమోదైన మూడు కేసుల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే ఆమెకు బెయిల్ మంజూరైంది. మిగతా రెండు కేసుల్లో బెయిల్ రానందున శిల్ఫ విడుదల అయ్యే అవకాశం లేదు.

ముగిసిన కస్టడీ...

పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి పోలీస్‌ కస్టడీ బుధవారం ముగిసింది. ఉప్పర్‌పల్లి కోర్టు ఆదేశాల ప్రకారం శిల్పా చౌదరిని పోలీసులు ఒక్క రోజు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో భాగంగా పోలీసులు ఆమె బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేశారు. కోకాపేట్‌లోని యాక్సిస్ బ్యాంకులో ఉన్న శిల్పా చౌదరి ఖాతాకు సంబంధించిన వివరాలను బ్యాంకు అధికారుల సమక్షంలో పోలీసులు తనిఖీ చేశారు. బ్యాంకు లాకర్‌లో ఏమీ లభించకపోవడంతో నిందితురాలిని తిరిగి నార్సింగి ఎస్ఓటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇతరుల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పా.. వాటిని ఎక్కడికి మళ్లించిందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

పక్కా ప్రణాళిక ప్రకారం...

ఆమె పక్కా ప్రణాళిక ప్రకారం మోసం చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ మోసం బయటపడినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో శిల్ప, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కాల్ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు.. ఈ ఏడాది కాలంలో వారిద్దరూ కలిసి ఎక్కువగా ఎవరితో మాట్లాడారనే వివరాలను సేకరించే పనిలో పడ్డారు.

వీ చూడండి:

Last Updated : Dec 16, 2021, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.