ETV Bharat / state

బాల్యవివాహాలు జరిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: రాచకొండ సీపీ

బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడానికి రాచకొండ షీ బృందాల పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కేసులు నమోదు చేయడంతో పాటు వివాహాలు జరిపించడంలో కీలకంగా ఉంటున్న వారిని ఊచలు లెక్కపెట్టేలా చేస్తున్నారు. 2016లో రాచకొండ కమిషనరేట్‌ ఏర్పాటైంది. గత అయిదేళ్లలో షీ బృందాల పోలీసులు 100 బాల్య వివాహాలు అడ్డుకున్నారు. అత్యధికంగా భువనగిరిలో 43, చౌటుప్పల్‌లో 25 వివాహాలను అడ్డుకున్నారు.

rachakonda cp
బాల్యవివాహాలు జరిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: రాచకొండ సీపీ
author img

By

Published : May 14, 2021, 1:53 AM IST

బాల్యవివాహాలు జరిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: రాచకొండ సీపీ

బాల్య వివాహాలు జరిపించే వారిపై రాచకొండ పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే వివాహాలు జరిగే ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించి బాధ్యులైన వారిని అరెస్టు చేస్తున్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు సుమారు వంద బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకున్నారు. 5 సంవత్సరాల నుంచి పరిశీలిస్తే భువనగిరిలో 43, చౌటుప్పల్‌లో 25, ఇబ్రహింపట్నం 12, కుషాయిగూడ 5, ఎల్‌బీనగర్‌ 3, మల్కాజిగిరి 8, వనస్థలిపురంలో 4... వెరసి మొత్తం వంద బాల్య వివాహాలను ఇప్పటి వరకు అడ్డుకున్నారు.

బాల్యవివాహాలు జరిపిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ హెచ్చరించారు. కమిషనరేట్‌ పరిధిలో గత ఐదేళ్లలో షీ టీమ్‌లు వంద బాల్యవివాహాలను అడ్డుకున్నారని సీపీ తెలిపారు. సమాచారం అందిన వెంటనే వివాహాలు జరిగే ప్రాంతానికి చేరుకొని బాధ్యులైన వారిని అరెస్టు చేస్తున్నట్లు వివరించారు. బాల్యవివాహ నిరోధక చట్టం కింద వధూవరుల తల్లిదండ్రులు, మధ్యవర్తులపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేస్తున్న సిబ్బందిని అభినందించి... వారికి సీపీ నగదు పురస్కారాలు అందజేశారు. బాల్యవివాహాలు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మహేశ్‌ భగవత్‌ సూచించారు.

ఇదీ చదవండి: 'కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.