తెలంగాణలో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 6న షీ బృందాల ఆధ్వర్యంలో పరుగు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన డయల్ 100, హాక్ -ఐ అప్లికేషన్‌ను ప్రచారం చేయనున్నట్లు అంజనీ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి టీ-షర్టులు, మెడల్స్‌ను ఆయన ఆవిష్కరించారు.
పరుగులో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొంటారని వెల్లడించారు. అదే రోజు సాయంత్రం కోఠి మహిళా కళాశాలలోనూ సాంస్కృతిక కార్యక్రమాలుంటాయన్నారు. మహిళల భద్రత కోసం షీబృందాలను ఏర్పాటు చేసి 5 సంవత్సరాలైందని... మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు.
ఇవీ చూడండి: భర్త నమ్మకమే నిజమైంది.. 14ఏళ్లకు తిరిగొచ్చింది