ప్ర. సెప్టెంబర్‌లో వ్యాక్సిన్ వస్తుందని చెప్పారుగా దాని గురించి మీ మాటల్లో...
జ. సెప్టెంబర్‌లో వ్యాక్సిన్ రావడం కష్టం. దాని మీద ప్రోగ్రస్ చాలా ఉంది. ఆక్స్‌ఫర్డ్‌లో వ్యాక్సిన్ గురించి చాలా కృషి చేస్తున్నారు. పగలు, రాత్రి శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు. ఇక్కడ శాస్త్రవేత్తలు అక్కడి వారితో చర్చిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరాంతానికి వ్యాక్సిన్ వచ్చే వీలుంది. అక్కడ అనుమతులు లభించగానే... భారత్‌కు వస్తోంది. ప్రజలందరికీ అవసరమనుకున్న పద్ధతిలో మార్చి లేదా ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.
ప్ర. ఎన్ని కంపెనీలు ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్లో ముందంజలో ఉన్నాయి?
జ. మొత్తం ఐదు బయోటెక్ కంపెనీలు మన దేశంలో ఉన్నాయి. వీటిలో నాలుగు కంపెనీలు మన హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
ప్ర. బల్క్ ప్రొడక్షన్లో మన దేశమే... ప్రపంచానికి సప్లై చేస్తుందా?
జ. కచ్చితంగా... మనకు కావలసినన్ని వనరులు, మేథోసంపత్తి పుష్కలంగా ఉన్నాయి. 25 సంవత్సరాల క్రితమే మనం డబ్ల్యూహెచ్‌వో నుంచి ప్రీ క్వాలిఫికేషన్‌ను తెచ్చుకున్నాం. చైనాకు నాలుగేళ్ల క్రితం వచ్చింది. దీని బట్టి చూస్తే మనం చాలా ముందంజలో ఉన్నాం.
ప్ర. చైనా వాళ్లకంటే వ్యాక్సిన్ మనం తక్కువ రేటుకి ఇస్తామంటారా?
జ. తప్పకుండా. వాళ్ల కన్నా తక్కువ రేటులో చేయగలం.
ఇవీ చూడండి: కరోనాతో సహజీవనం అంటే ఇదేనా!