శంషాబాద్లో నకిలీ వీసాలతో ప్రయాణిస్తున్న31మంది మహిళల అరెస్టు శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులతనిఖీలు కొనసాగుతున్నాయి. నకిలీ వీసాలతో వెళ్తున్న 20 మందిని పట్టుకున్నారు. రెండ్రోజుల క్రితం కూడా 11 మందిని అరెస్ట్ చేశారు.మొత్తం 3రోజుల వ్యవధిలో 31 మందిని అడ్డుకున్నారు. వీరంతా కువైట్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా... పట్టుబడ్డారు. నిందితులను విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. నకిలీ వీసాలు వీళ్లకు ఎవరు ఇస్తున్నారు...వీరి వెనక ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి:నకిలీ వీసాలు కలిగిన 20మంది మహిళలు అరెస్ట్