రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రతను తొలగించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం, వై కేటగిరీ భద్రత పునరుద్ధరించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భద్రతను తొలగించారని షబ్బీర్ అలీ తరఫు న్యాయవాది ప్రకాష్ రెడ్డి వాదించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా లేరని.. ఆయనకు భద్రత కొనసాగించాల్సినంత ఘటనలు ఏమీ జరగలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ పేర్కొన్నారు. భద్రతను ఎందుకు తొలగించారో పూర్తి వివరాలతో సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు... విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనసాగించాలని షబ్బీర్ అలీ తరఫు న్యాయవాది కోరగా... హైకోర్టు నిరాకరించింది.
ఇవీచూడండి: త్వరలో ఆమరణ నిరాహారదీక్ష: ఉత్తమ్