అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ను మించిన వారెవరు లేరని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు తక్కువ కేటాయింపులు చేసిందనడం పచ్చి అబద్దమని ఆయన పేర్కొన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో మైనార్టీలకు రూ.3 నుంచి వెయ్యి కోట్ల వరకు పెంచిన ఘనత తమదేనన్నారు. మైనారిటీలకు సామూహిక వివాహాలు జరిపించడంతో పాటు మైనార్టీ స్కూళ్లు పెట్టింది కూడా తామేనని తెలిపారు. ఈ సారి కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలకు బడ్జెట్‌లో 30 శాతం తగ్గించారని దుయ్యబట్టారు. ప్రగతిభవన్‌లో కుక్క చనిపోతే వైద్యుల మీద కేసు పెట్టారని.. డెంగీతో ఇంతమంది చనిపోతే ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యంపై ఎక్కడైనా చర్చకు సిద్దమని షబ్బీర్ అలీ సవాల్ చేశారు.
ఇవీచూడండి: 'ఓఎంసీ కేసును విశాఖ సీబీఐకు బదిలీ చేయండి'