చమురు ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతకంతకూ పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం సామాన్యులపై పడుతోంది. ప్రధానంగా రవాణ రంగంపై భారం ఎక్కువవుతోంది. ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. దీని ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లాంటి మారుమూల ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉంటోంది.
అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గుతున్నా.. కేంద్రం ఉపశమనం కలిగించట్లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ తగ్గించి తమకు ప్రయోజనం చేకూర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.