హైదరాబాద్ మూసాపేట్ రిజిస్ట్రేషన్ కార్యాలయాని(Registration Office)కి రిజిస్ట్రేషన్ కోసం ఉదయాన్నే ప్రజలు వచ్చారు. సంబంధిత పత్రాలు సిద్ధం చేసుకున్నారు. కాని సర్వర్ సమస్య రావటంతో మధ్యాహ్నం 12 గంటల వరకు వేచిచూసి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.
వెబ్సైట్లలో కొన్ని మార్పులు చేస్తుండడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి సర్వర్లు పనిచేస్తాయని తెలిపారు. ప్రజలు తమకు సహకరించాలి కోరారు.
ఇదీ చదవండి: తిమింగలం కడుపులో 'నిధి'- రాత్రికి రాత్రే కోటీశ్వరులైన జాలర్లు