రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ రెసిడెంట్ వైద్యులు అత్యవసర సేవలు బహిష్కరించారు. సుమారు 700 మంది సీనియర్ రెసిడెంట్ వైద్యులు ఆందోళనబాట పట్టారు. జీతాల విడుదలకు అంగీకరించినా ఇతర డిమాండ్లు నెరవేర్చలేదని ఎస్‌ఆర్‌లు వాపోతున్నారు.
మే 2021 స్టైపెండ్‌తో పాటు ఆగస్టుకు ఏడాది పూర్తిచేసినట్టు గుర్తించాలని రెసిడెంట్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది 9 నెలలే విధులు నిర్వహించినా... గతేడాది 3 నెలలు కొవిడ్ సమయంలో అదనంగా విధులు నిర్వహించారు. అదనపు విధులను కలిపి కోర్స్ పూర్తయినట్టు గుర్తించాలని ఎస్‌ఆర్‌లు డిమాండ్ చేస్తున్నారు.