మానుకోట తిరుగుబాటు పదకొండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భగా బుధవారం చర్చా గోష్ఠి నిర్వహిస్తున్నట్లు... తెజస నేతలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మానుకోట తిరుగుబాటు కీలకఘట్టంగా ఉండేదని అన్నారు. ఉదయం 11 గంటలకు జూమ్, ఫేస్‌బుక్ మాధ్యమాల వేదికగా సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు.
ఈ చర్చాగోష్ఠిలో తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్, అద్దంకి దయాకర్ పాల్గొంటారని తెలిపారు. వారితో పాటు నాటి ఉద్యమంలో భాగమైన ప్రముఖులు పాల్గొని ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నల్గొండ జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు అంచనాలు సిద్ధం చేయాలి: సీఎం