ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు - ప్రభుత్వం తరఫున పేదలకు కానుకలు - బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు క్రిస్మస్‌ బహుమతుల పంపిణీ

Semi Christmas Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. విద్యుత్‌దీపాల అలంకరణలతో చర్చిలన్నీ కాంతులీనుతున్నాయి. రంగురంగుల మెరుపు కాగితాలు, బెలూన్‌‌లు, స్టార్‌‌లతో శోభాయమానంగా మారాయి. క్రైస్తవులు, రాజకీయ ప్రముఖులు పేదలకు, కానుకలు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు.

Ponguleti Distributed Gifts in Khammam District
Semi Christmas Celebrations in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 11:41 AM IST

Semi Christmas Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చర్చిలను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ప్రభుత్వం తరఫున పేదలకు క్రిస్మస్ కానుకలు (Christmas) అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాటలు పాడుతూ ప్రభువును స్మరించుకున్నారు. ప్రముఖులు, రాజకీయవేత్తలు కేకులు కోసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు - అందంగా ముస్తాబైన చర్చిలు

ఆసియా ఖండంలో రెండో అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్‌ చర్చి క్రిస్మస్‌ వేడుకలకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. క్రిస్మస్‌ను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సీఎస్ఐ యంత్రాంగం, స్థానిక ఫాస్టరేట్‌‌ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి నియోజకవర్గంలో పేదలను గుర్తించి వారికి ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున క్రిస్మస్ కానుకలు అందజేస్తున్నారు.

Ponguleti Distributed Gifts in Khammam District : ఖమ్మం జిల్లా పాలేరులో ప్రభుత్వం తరఫున నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ సంబురాల్లో మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనను గజమాలతో సత్కరించారు. అనంతరం ర్యాలీగా చర్చికి చేరుకున్నారు. పేదలకు బహుమతులు, దుస్తులు పంపిణీ చేశారు. కేక్‌ కోసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ప్రేమతో మెలగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అన్నారు. మణుగూరులో జరిగిన సెమీ క్రిస్మస్‌ వేడుకలకు హాజరైన ఆమె నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్​ వేడుకలు.. పాల్గొన్న ప్రజాప్రతినిధులు

మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ, కురవి, దంతాలపల్లి మండలాల్లో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో, ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌ పాల్గొన్నారు. సర్కారు తరఫున క్రిస్మస్‌ బహుమతులు పంపిణీ చేశారు. క్రిస్మస్ పండగ సందర్భంగా కేక్ కట్ చేశారు. యేసు ప్రభు బోధనలు అనుసరించి సన్మార్గంలో నడవాలని ప్రజలకు సూచించారు.

BRS MLAs Distributed Gifts on The Occasion of Christmas : క్రిస్టియానిటీ ద్వారా శాంతి నెలకొంటుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ కానుకలు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైన మత విద్వేషాలు, కొట్లాటలు లేని సమాజాన్ని నిర్మించుకోవాలని, మతాలను సమానంగా గౌరవించినప్పుడే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మాజీ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కేక్ కోసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సర్కారు అందిస్తున్న దుస్తులను పేదలకు పంపిణీ చేశారు. పది మందికి సహాయం చేయడమే ప్రభువు మార్గం అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు..

ఘనంగా ప్రారంభమైన ఏసుక్రీస్తు జన్మదిన​ వేడుకలు ఆకట్టుకుంటున్న క్రిస్మస్ ట్రీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.