ETV Bharat / state

ఊపందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థిత్వాల ఎంపిక

author img

By

Published : Sep 21, 2020, 4:58 AM IST

రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్యమైన పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, మాజీ ఎమ్మెల్యేలు... మాజీ మంత్రులు సైతం బరిలో దిగేందుకు పోటీ పడుతున్నారు. 50 మందికిపైగా నాయకులు బరిలో దిగేందుకు ముందుకు రాగా.. దరఖాస్తుల పరిశీలన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని పీసీసీ భావిస్తోంది. వీలైనంత త్వరగా అధిష్ఠానం నిర్ణయం మేరకు.. అభ్యర్థులను ప్రకటించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.

ఊపందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థిత్వాల ఎంపిక
ఊపందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థిత్వాల ఎంపిక

ఊపందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థిత్వాల ఎంపిక

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో... పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థిత్వాల ఎంపిక ప్రక్రియ ఊపందుకుంది. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌... వరంగల్‌- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజక వర్గాల నుంచి శాసనమండలి బరిలో దిగేందుకు... కాంగ్రెస్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువ పోటీ నెలకుంది. ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తికలిగిన అభ్యర్థుల నుంచి.. పీసీసీ దరఖాస్తులను ఆదివారం వరకు స్వీకరించగా.... 50 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

ముఖ్య నేతల ప్రయత్నాలు..

2018 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ముఖ్యనేతలు.. పలువురు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అనూహ్యంగా ముఖ్యనేతలే బరిలోకి దిగేందుకు ముందుకు వస్తుండడం వల్ల కాంగ్రెస్‌ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో కరీంనగర్‌- నిజమాబాద్‌ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి.. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ముఖ్యనేత జీవన్‌ రెడ్డి గెలుపొంది శాసనమండలిలో అడుగుపెట్టారు. ఇప్పుడు మండలిలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ఏకైన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డినే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలపై.. పలువురు ముఖ్య నేతలు దృష్టి సారించారు.

30 మంది వరకు...

వరంగల్‌- ఖమ్మం- నల్గొండ నియోజక వర్గానికి... పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌... ఓయూ ఐకాస నేత మానవతారాయ్‌, పీసీసీ లీగల్‌ సెల్‌ ఛైర్మన్‌ దామోదర్‌ రెడ్డి సహా... పలువురు నాయకులు అభ్యర్థిత్వాలను ఆశిస్తూ దరఖాస్తు చేశారు. ఇక హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ నియోజక వర్గం నుంచి... పోటీ చేసేందుకు మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌ రెడ్డి, సంపత్‌కుమార్‌... మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్‌, రామ్మోహన్‌రెడ్డి, కేఎల్‌ఆర్‌... మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి సహా 30 మంది వరకు.. దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.

చివర క్షణంలో...

గతంలో ఎమ్మెల్యేల నియోజక వర్గాల నుంచి.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగిన పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి... చివర క్షణంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో బరిలో దిగలేకపోయారు. ఈసారి పట్టభద్రుల నియోజక వర్గం నుంచి.. తనకు అవకాశం కల్పించాలని పార్టీని గట్టిగా కోరుతున్నారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌... రెండు ఎమ్మెల్సీ నియోజక వర్గాల్లో ఎక్కడో ఒక చోట అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. పలువురు న్యాయవాదులు, విశ్రాంత ఇంజినీర్లు కూడా... అభ్యర్థిత్వం బరిలో ఉన్నారు.

పీసీసీ ప్రత్యేక దృష్టి...

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విధానంపై... పీసీసీ ప్రత్యేక దృష్టి సారించనుంది. దరఖాస్తులను విశ్లేషించి వివిధ అంశాలు, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని.. ఒక్కో ఎమ్మెల్సీ స్థానం నుంచి నలుగురైదుగురు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ పేర్లను పీసీసీ... కాంగ్రెస్‌ అధిష్ఠానానికి పంపనుంది. ఏఐసీసీ నిర్ణయం మేరకే.. అభ్యర్థులను ప్రకటిస్తారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. తెరాస, భాజపాల నుంచి గట్టి పోటీ నేపథ్యంలో.. దీటైన అభ్యర్థిని ఎంపిక చేస్తామని, బలమైన అభ్యర్థిగా ప్రజా క్షేత్రంలో చురుగ్గా ఉండే వారికే అధిక ప్రాధాన్యం ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

క్రియాశీలకంగా...

పట్టభద్రుల ఓటర్ల నమోదు నుంచి... ఓటింగ్‌ వరకు కూడా ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంటున్న కాంగ్రెస్‌ వర్గాలు.. సాధ్యమైనంత ముందుగా అభ్యర్థులను ప్రకటించాలని పీసీసీ భావిస్తోంది. త్వరలోనే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి.. అభ్యర్థిత్వాల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి: 'మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు... అందరూ అప్రమత్తంగా ఉండండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.