ETV Bharat / state

'నీటి బకాయిలపై వడ్డీమాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి' - జలమండలి జీఎంను కలిసిన సీతాఫల్​మండి కార్పొరేటర్​ హేమ

దీర్ఘకాలికంగా ఉన్న నీటి బకాయిలపై వడ్డీమాఫీ స్కీంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్​ సీతాఫల్​మండి కార్పొరేటర్​ హేమ సూచించారు. జలమండలి జీఎం రమణరెడ్డితో ఆమె సమావేశమై వాటర్​బిల్లుల వన్​టైం సెటిల్మెంట్​ పథకం గురించి ఆరా తీశారు.

seethaphalmandi corporator hema meet water board gm ramana reddy
'నీటి బకాయిలపై వడ్డీమాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి'
author img

By

Published : Jul 29, 2020, 6:03 PM IST

జలమండలి జీఎం రమణ రెడ్డితో హైదరాబాద్​ సీతాఫల్​మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ సమావేశం అయ్యారు. వాటర్ బోర్డు పెట్టిన నీటి బకాయిలపై వడ్డీ స్కీం గురించి అడిగి తెలుసుకున్నారు. నీటి బకాయిలకు సంబంధించి వన్​టైం సెటిల్మెంట్ స్కీంలో భాగంగా దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న బిల్లుల వసూలు దిశలో ఈ నిర్ణయం తీసుకున్నామని రమణారెడ్డి వెల్లడించారు. రూ. 2 వేల వరకు వడ్డీ మాఫీ చేసే అధికారం మేనేజర్లకు, రూ. 2001 నుంచి రూ.10 వేల వరకు DGM స్థాయిలో, రూ.10 వేలకు పైగా వడ్డీ మాఫీ అధికారాన్ని జనరల్ మేనేజర్​కు అప్పగిస్తూ వాటర్ బోర్డ్ ఎండీ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

ఈ పథకం ఆగస్టు 1 నుంచి 30 రోజుల పాటు అమలులో ఉంటుందని, డివిజన్ ప్రజలు జలమండలి అధికారులకు సహకరించి దీనిని సద్వినియోగపరచుకోవాలని కార్పొరేటర్ హేమ విజ్ఞప్తి చేశారు. అలాగే డివిజన్​లో ఉన్న మైలర్​గడ్డలో కార్పొరేటర్ పర్యటించి వాటర్​లైన్ సమస్యలను ఏఈ అన్విత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. కొత్త పైపులైన్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరగతిన పనులు పూర్తి చేయాలని జలమండలి అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.