ETV Bharat / state

హైదరాబాద్​లో విత్తన సదస్సు - HYD_SEMINAR

హైదరాబాద్​లో ఈ నెల 26 నుంచి జులై 3 వరకు 32వ అంతర్జాతీయ విత్తన సదస్సు జరగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి కోరారు. ముగింపు సమావేశానికి గవర్నర్‌ హాజరుకానున్నారు.

హైదరాబాద్​లో విత్తన సదస్సు
author img

By

Published : Jun 25, 2019, 7:54 AM IST

Updated : Jun 25, 2019, 8:05 AM IST

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి జులై 3 వరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 32వ అంతర్జాతీయ విత్తన సదస్సు నిర్వహిస్తోంది. హైటెక్స్‌లో ఉదయం 9 గంటలకు జరగబోయే ప్రారంభోత్సవ సదస్సుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి కోరారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులకు వ్యవసాయశాఖ ఆహ్వానాలు పంపించింది.

తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్ బౌల్​గా చూడాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఐదేళ్లలో అనేక వినూత్న నిర్ణయాలు తీసుకుని దేశంలోనే తెలంగాణను విత్తనకేంద్రంగా నిలిపారని మంత్రి నిరంజన్​ కొనియాడారు. ఇస్టా కాంగ్రెస్ సదస్సుతో తెలంగాణ ఖ్యాతి అంతర్జాతీయంగా వెలుగొందడం ఖాయమన్నారు.

ఈనెల 28న జరిగే ముగింపు సమావేశానికి హాజరుకావాల్సిందిగా గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహాన్‌ను మంత్రి నిరంజన్‌ రెడ్డి కోరారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన మంత్రి గవర్నర్‌ నరసింహాన్‌తో సమావేశమై ముగింపు సమావేశానికి రావల్సిందిగా ఆహ్వానించారు.

ఇవీ చూడండి: ఫోన్​ మాట్లాడవద్దన్నందుకు యువతి ఆత్మహత్య

sample description
Last Updated : Jun 25, 2019, 8:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.