ETV Bharat / state

'సికింద్రాబాద్ కంటోన్మెంట్​ను అభివృద్ధి పథంలో నడిపిస్తాం'

సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని బోర్డు ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్​రెడ్డి కంటోన్మెంట్​ సర్వసభ్య సమావేశంలో తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పాడైన రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసినట్లు మహేశ్వర్​రెడ్డి వెల్లడించారు.

secunderabad contonment meeting on hyderabad floods
'సికింద్రాబాద్ కంటోన్మెంట్​ను అభివృద్ధి పథంలో నడిపిస్తాం'
author img

By

Published : Oct 19, 2020, 6:44 PM IST

సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ ప్రాంత సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే లక్ష్యమని కంటోన్మెంట్​ బోర్డు ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్​రెడ్డి తెలిపారు. కంటోన్మెంట్​ డీఈవో కార్యాలయంలో కంటోన్మెంట్​ బోర్డు సభ్యులతో ఆర్మీ అధికారులు, రక్షణ శాఖ అధికారులతో సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కంటోన్మెంట్​ పారిశుద్ధ్య విభాగానికి కార్మికులు చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు.

రామన్నకుంట చెరువు వద్ద వరద ప్రభావం ఎక్కువగా ఉన్నందున.. ఆ ప్రాంతంలో వైట్​ టాపింగ్​ రహదారిని ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లోనూ వర్ష సూచన ఉన్నందున.. ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకుంటామని బోర్డు సమావేశంలో నిర్ణయించామని మహేశ్వర్​రెడ్డి తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్​ కిట్​ను కంటోన్మెంట్​లోనూ ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. కంటెన్మెంట్​లో అస్తవ్యస్థంగా ఉన్న రహదారులను మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కంటోన్మెండ్​ మౌలిక సదుపాయాలు మంచినీటి సరఫరా, వీధి దీపాల పునరుద్ధరణతో పాటు పలు అభివృద్ధి అంశాలపై చర్చ జరిగిందన్నారు.

ఇవీ చూడండి: మరోసారి భారీ వర్షసూచన.. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.