Secunderabad Cantonment Board Election cancelled: దేశంలోని అన్ని కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ.. కేంద్ర రక్షణ శాఖ గెజిట్ విడుదల చేసింది. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ కూడా రద్దైంది. ఫిబ్రవరి 17వ తేదీన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నిర్వహణకు రక్షణ శాఖ విడుదల చేసిన.. ఎలక్షన్లను రద్దు చేసింది. ఇటీవల కంటోన్మెంట్ బోర్డులను స్థానిక సంస్థల్లో కలుపుతారని.. రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది.
మధ్యలో ప్రత్యుత్తరాలు కూడా నడిచాయి. కానీ మధ్యలో ఎలక్షన్స్‌కి గెజిట్ ఇచ్చారు. మళ్లీ ఇవాళ వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక కంటోన్మెంట్ బోర్డులను స్థానిక సంస్థల్లో కలిపే అవకాశం ఎక్కువగా ఉందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు చెబుతున్నారు. ఎలక్షన్ల రద్దును తాము స్వాగతీస్తున్నామని వెల్లడించారు.
అభ్యంతరాలు ఏమన్నా ఉంటే చెప్పొచ్చు: ఈనెల 24న దేశవ్యాప్తంగా 57 కంటోన్మెంట్లకు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల ప్రణాళికను రూపొందించిన బోర్డు.. అభ్యంతరాలు ఏమన్నా ఉంటే చెప్పాలని బోర్డు సీఈవో మధుకర్ నాయక్ కోరింది.
Secunderabad Cantonment Board Election Schedule: దేశంలోని 57 కంటోన్మెంట్లకు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో కంటోన్మెంట్ బోర్డులో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశేఖర్, సీఈఓ మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పాల్గొని ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించారు. సీఈఓ మధుకర్ నాయక్ పలు అంశాలపై మాట్లాడారు.
ఈ అవకాశం వారు సద్వినియోగం చేసుకోవాలి: మార్చి 1 నుంచి ఓటర్ల నమోదు, సవరణలకు కంటోన్మెంట్ వాసులకు అవకాశం కల్పిస్తున్నట్లు సీఆఓ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి ప్రారంభోత్సవాలు, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఉండవని తెలిపారు. రోజువారి పనులు యధావిధిగా కొనసాగుతాయన్నారు. కంటోన్మెంట్ వాస్తవ్యులు మాత్రం తప్పకుండ ఓటర్ల లిస్టులో పేర్లు నమోదు చేసుకొని ఎన్నికలలో పాల్గొని వారికి నమ్మకమున్న నాయకున్ని ఎన్నుకోవాలని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: