వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సికింద్రాబాద్ నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ రమేష్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నామాలగుండులోని బీఎన్ఆర్ గార్డెన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
ట్రాఫిక్ నిబంధనలను పాటించనివారు ప్రమాదాలను ఆహ్వానించినట్లేనని ట్రాఫిక్ ఏసీపీ రమేష్ అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలన్న ఆయన గంటకు 40 కీ.మీలకు మించి వేగంగా వెళ్లకూడదని సూచించారు. జీబ్రా క్రాసింగ్ వద్ద నిబంధనలను ఉల్లంఘించడం వల్ల పాదచారులకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నెల రోజుల పాటు సాగుతుందని ఏసీపీ వివరించారు.
ఇదీ చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి