రాష్ట్రంలో రైతుల సౌకర్యార్థం యాంత్రీకరణ పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దనరెడ్డి అన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో... జాతీయ ఆహార భద్రత పథకం వెబ్ పోర్టల్ (htt://nfsm.telangana.gov.in) ను కార్యదర్శి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐసీ స్టేట్ ఇన్‌ఫర్మాటిక్ ఆఫీసర్ రాజశేఖర్, సాంకేతిక సంచాలకులు సురేష్‌కుమార్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయకుమార్, క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ - ఈఓడీబీలో భాగంగా వ్యవసాయ శాఖ, హైదరాబాద్ నిక్ భాగస్వామ్యంతో ఈ పోర్టల్‌ను రూపొందించాయి. ఈ సందర్భంగా జూమ్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడారు.
ఈ వెబ్ పోర్టల్ ద్వారా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం పథకం కింద యంత్ర పరికరాలు, లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన, రాయితీ మంజూరు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో పూర్తి పారదర్శకంగా జరుగుతుందని కార్యదర్శి జనార్దనరెడ్డి తెలిపారు.
లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ఎంపిక చేసుకున్న యంత్ర పరికరాలు సరఫరా చేయడానికి టీఎస్ ఆగ్రోస్ సంస్థను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని చెప్పారు. ఈ పథకం పారదర్శకంగా... గడువులోగా అమలు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆయన ఆదేశించారు.
- ఇవీ చూడండి: ప్రభుత్వ అధికారిపై జిల్లా పార్టీ అధ్యక్షుడి దాడి