ETV Bharat / state

హుజూరాబాద్‌ నుంచే రెండో విడత గొర్రెల పంపిణీ - గొర్రెల పంపిణీ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండో విడత గొర్రెల పంపిణీ బుధవారం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొనున్నారు.

sheep distribution
గొర్రెల పంపిణీ
author img

By

Published : Jul 27, 2021, 8:33 PM IST

రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు.

6 వేల కోట్ల రూపాయలు మంజూరు

ఆయా జిల్లాల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు నేతృత్వంలో లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 3.81 లక్షల మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందుకోసం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ 6 వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అంతేకాకుండా పెరిగిన ధరలు, లబ్ధిదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గొర్రెల యూనిట్ ధర గతంలో 1.25 లక్షల రూపాయలు ఉండగా... ఇప్పుడు ఆ యూనిట్ ధర 1.75 లక్షల రూపాయల వరకు పెంచేందుకు కూడా సీఎం ఆమోదం తెలిపారు. 8,109 సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న 7,61,898 మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొదటి విడతలో 3,76, 223 యూనిట్ల గొర్రెలు పంపిణీ

మొదటి విడతలో 5 వేల కోట్ల రూపాయలు కేటాయించగా... 4702.78 కోట్ల రూపాయల ఖర్చుచేసి 3,76,223 యూనిట్ల గొర్రెలు లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు ప్రభుత్వవర్గాలు స్పష్టం చేశాయి. హుజూరాబాద్​లో ఉపఎన్నిక ఉన్నందుకే రెండో విడత గొర్రెల పంపిణీ హుజూరాబాద్​ నుంచి ప్రారంభిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దళిత బంధు కూడా హుజూరాబాద్​ నుంచే ప్రారంభిస్తుండటం గమనార్హం.

2017లో గొర్రెల పంపిణీ ప్రారంభించిన సీఎం కేసీఆర్​

2017 జూన్​ 20న సిద్దిపేట జిల్లా కొండపాకలో సీఎం కేసీఆర్​ మొదటి విడత గొర్రెల పంపిణీ ప్రారంభించారు. వచ్చే మూడేళ్లలో గొల్లకుర్మలు కోటీశ్వరులు అవుతారని సీఎం ఆ రోజు చెప్పారు. మొదటి విడత గొర్రెల పంపిణీలో గోర్లు రానివారు రెండో విడతలో ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రేపటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేయనున్నారు. గొర్రెల కోసం దరఖాస్తు చేసుకుని, డీడీలు కట్టిన వారికే గొర్రెలు పంపిణీ చేయనున్నారు.

ఇదీ చదవండి: పెద్దలకు మాత్రమే.. అస్సలు మిస్​ కావద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.